విద్యాలయం దేవాలయంతో సమానం

by Sridhar Babu |   ( Updated:2023-10-03 15:39:56.0  )
విద్యాలయం దేవాలయంతో సమానం
X

దిశ, బాన్సువాడ : విద్యాలయం దేవాలయంతో సమానమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ. 40 లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను, రూ. 50 లక్షలతో నిర్మించిన అయ్యప్పస్వామి దేవాలయ సన్నిధానం, రూ. 68 లక్షలతో నిర్మించిన ముదిరాజ్ సంఘం భవనాలను ప్రారంభించి, అనంతరం రూ. 25 లక్షలతో నూతనంగా నిర్మించే పెద్దమ్మ తల్లి దేవాలయానికి ఆయన భూమి పూజ చేశారు. ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో దేవాలయాల నిర్మాణం, అభివృద్ధి కొరకు 150 కోట్ల రూపాయలు మంజూరు చేశానని, పేదలు తక్కువ ఖర్చుతో ఫంక్షన్లు చేసుకోవడానికి 70 కోట్ల రూపాయలతో 120 జనరల్ ఫంక్షన్ హాల్స్ లను నిర్మిస్తున్నామన్నారు. సమాజంలో మెజారిటీగా ఉన్న పేదలకు సంక్షేమ పథకాలు అవసరమని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story