- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తృటిలో తప్పిన ప్రమాదం.. చెట్టును ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు..
దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలం లింగాయిపల్లి శివారులో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు చెట్టును ఢీకొన్న ఘటనలో పెనుప్రమాదం తప్పింది. కామారెడ్డి పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్ లో చదువుతున్న పిల్లలను తీసుకుని బస్సు కామారెడ్డి నుంచి బయలుదేరింది. కామారెడ్డి నుంచి లింగాయిపల్లికి వెళ్తుండగా గ్రామ శివారులో డ్రైవర్ బాలకిషన్ నిర్లక్ష్యంతో అదుపుతప్పి చెట్టును ఢీకొంది.
బస్సులో సుమారు 30 నుంచి 40 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు ఒక్కసారిగా చెట్టును ఢీకొనడంతో పిల్లలు హాహాకారాలు చేస్తూ తీవ్రభయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పిల్లల హాహాకారాలు విని అక్కడున్న స్థానికులు బస్సు వద్దకు చేరుకుని విద్యార్థులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. దేవునిపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్తితిని సమీక్షించారు. అయితే ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా లేక డ్రైవర్ ఏదైనా మద్యం మత్తులో ఉన్నారా అనేది ఇంకా తెలియరాలేదు.