- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లా కోర్టులో వ్యక్తి హల్ చల్..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో ఓ వ్యక్తి హల్ చల్ చేశారు. తన వద్ద ఉన్న వాటర్ బాటిల్ ను పెట్రోల్ గా చెబుతూ దాన్ని ఒంటి పై పోసుకుంటానని బెదిరించి కోర్టు మొదటి అంతస్తుకు వెళ్లాడు. అక్కడి నుంచి కిందకు దూకుతానని బెదిరించాడు. స్థానికంగా ఉన్న కోర్టు సిబ్బంది సముదాయించి కిందకు తీసుకురాగా గొంతు వద్ద కోసుకుని గాయం చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దండిగుట్ట గ్రామానికి చెందిన కేతావత్ రెడ్డి రెడ్యానాయక్ తన వ్యవసాయ క్షేత్రానికి వెళుతుండగా మార్గమధ్యంలో గుర్తుతెలియని దుండగులు ఆపి డబ్బుల కోసం విచక్షణ రహితంగా దాడిచేసి తన వద్ద రూ.5 వేలు లాక్కుకున్నారని బాధితుడు వాపోయారు. ఈ విషయం పై నవీపేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని ఆయన తెలిపారు. దీంతో ప్రాణ భయంతో జిల్లా కేంద్రంలోని కోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మకంతో గాయాలతో వచ్చినట్లు ఆయన వెల్లడించారు. స్థానికంగా కోర్టు సిబ్బంది అతన్ని సముదాయించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.