BREAKING: బీఆర్ఎస్‌కు షాక్.. నస్పూర్ మున్సిపాలిటీ హస్తగతం

by Satheesh |
BREAKING: బీఆర్ఎస్‌కు షాక్.. నస్పూర్ మున్సిపాలిటీ హస్తగతం
X

దిశ, నస్పూర్: నస్పూర్ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ హస్తగతమైంది. డిసెంబర్ 18న మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్‌కు వ్యతిరేకంగా 18 మంది కౌన్సిలర్లు మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్‌కు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ జనవరి 12వ తేదీన అవిశ్వాసంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 8న ప్రత్యేక వాహనంలో 17 మంది కౌన్సిలర్లు హైదరాబాద్ క్యాంపు తరలివెళ్లి తిరిగి నేడు అవిశ్వాస సమావేశానికి హాజరయ్యారు. మున్సిపాలిటీలో మొత్తం 25 మంది కౌన్సిలర్లు సభ్యులు ఉండగా.. నేడు ప్రిసైడింగ్ అధికారి అయిన మంచిర్యాల ఆర్డీఓ రాములు ఆధ్వర్యంలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో 19 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఇద్దరు సీపీఐ కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా చేతులు లేపారు. దీంతో ప్రీసైడింగ్ అధికారి అవిశ్వాసం నెగ్గినట్టు తెలిపారు. దీంతో నస్పూర్ మున్పిపాలిటి హస్తగతమైంది. ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈ అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కు గైర్హజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed