ఆటోను ఢీ కోట్టిన లారీ.. పలువురికి గాయాలు..

by Sumithra |
ఆటోను ఢీ కోట్టిన లారీ.. పలువురికి గాయాలు..
X

దిశ, తాడ్వాయి (ఎల్లారెడ్డి) : ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్ట మైసమ్మ ఆలయం సమీపంలో ఆగిఉన్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో చెరువు కట్ట కిందకు దొర్లి పలువురు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై సీహెచ్ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం జప్తి జానకంపల్లి గ్రామానికి చెందిన నాయకోటి సాయిలుకు చెందిన ఆటో ఎక్కి అదే గ్రామానికి చెందిన మంగమల్లయ్య, ఆశ్చయపల్లి గ్రామానికి చెందిన సాయవ్వ ఆటోలో ప్రయాణిస్తున్నారు.

కట్టమైసమ్మ దగ్గరికి రాగానే ఇద్దరు భవానిపేట గ్రామానికి చెందిన బుమయ్య, బాలు వ్యక్తులు ఆటోను ఆపి ఎక్కగా ఆటోను ముందుకు తీసేలోపే వెనుక వైపుగా అతివేగంతో వస్తున్న లారీ ఆటోను ఢీ కొట్టడంతో పాల్టీలు కొట్టుకుంటూ చెరువులోకి దూసుకెళ్లిందన్నారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్థానికులు 108కి సమాచారం అందించిన వెంటనే గాయపడిన వారిని అంబులెన్సు లో ప్రయివేట్ అస్పటల్ కి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు డి కొట్టిన లారీ డ్రైవర్, క్లీనర్ ను అదుపులోకి తీస్కొన్నామని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో లారీని నడపడం వలనే ప్రమాదంకి కారణమని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేష్ తెలిపారు.

Advertisement

Next Story