సైబర్ నేరగాళ్ల ఉచ్చులో న్యాయవాది..

by Sumithra |
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో న్యాయవాది..
X

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చాలా మంది బాధితులు రోజుకోచోట సైబర్ నేరగళ్ళ వలలో చిక్కుకొని మోసపోతున్నారు. తాజాగా ఓ న్యాయవాది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని మోసపోయాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వెంకటరత్నం అనే న్యాయవాదికి ఎస్బీఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ క్రెడిట్ కార్డు రెన్యువల్ చేసుకోవాలంటూ కాల్ చేసి వెంకటరత్నం మొబైల్ కు ఓటిపిని పంపించారు.

వారి మాటలు నమ్మిన వెంకటరత్నం ఓటీపీని అవతలి వ్యక్తికి పంపడంతో వెంకటరత్నం అకౌంట్ నుంచి 33,500 డెబిట్ అయినట్లుగా మొబైల్ కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన న్యాయవాది వెంటనే స్థానిక కామారెడ్డి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. మోసపోయానని గ్రహించి న్యాయవాది వెంకటరత్నం స్థానిక కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి పట్టణ సీఐ నరేష్ తెలిపారు.

Advertisement

Next Story