ఐదేళ్లవుతున్నా ఓపెన్​కాని డమ్మీ ఖాతా

by Sridhar Babu |
ఐదేళ్లవుతున్నా ఓపెన్​కాని డమ్మీ ఖాతా
X

దిశ, గాంధారి : సరిగ్గా ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా ధరణిలో డమ్మీ ఖాతా ఓపెన్ కాకపోవడంతో రైతులు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఇప్పటికే చాలా అవకతవకలతో ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. మండల రెవెన్యూ పరిధిలోని మాన్యువల్ రికార్డులను ధరణి వెబ్సైట్లో 2018 లో పొందుపరచడంలో కొన్ని తప్పిదాలు జరిగాయి. అయితే అందులో డమ్మీ ఫైల్ లో ఉన్న రైతులకు భూములు పూర్తిగా పట్టా పాస్ బుక్ పైన ఎక్కించలేదు. 2018 నుండి నేటి వరకు ఐదేళ్లు గడుస్తున్నా డమ్మీ ఫైల్ ధరణి పోర్టల్ లో డిసబుల్ గానే ఉంది. ఇందులో

అనేక మంది రైతులు తమ భూములను పూర్తిస్థాయిలో పట్టా పాస్ బుక్ లో ఎక్కించుకోలేకపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి డమ్మీ ఫైల్ ఓపెన్ చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను కోరుతున్నారు. అయితే ధరణిలో కూడా డమ్మీ ఖాతాలు ఉన్నాయి. తహసీల్దార్ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గాంధారి గ్రామపంచాయతీ పరిధిలోగల 44 జీపీలు మొత్తం కలిపి 5000 నంబర్ తో ఒక డమ్మీ ఖాతాను తయారు చేశారు. అయితే ఈ ఖాతాలో 44 గ్రామపంచాయతీలకు సంబంధించిన సర్వే నంబర్లు తప్పుగా ఉంటే, ఏవైనా వారసత్వంగా వస్తున్న భూములు పరిష్కారం కాకపోతే,ప్రభుత్వ భూములు చుట్టుపక్కల వారు వారికి వీరికి మధ్యల ఏవైనా గొడవలు జరిగినా గ్రౌండ్ లెవెల్ లో అధికారులు వెళ్లలేక ఒక డమ్మీ ఫైల్ ను ఏర్పాటు చేసి అందులో వేయడం జరుగుతుంది.

డమ్మీ ఫైల్ ఓపెన్ చేయడం ఎమ్మార్వో చేతిలో లేదు...

సాధారణంగా రైతులందరూ డమ్మీ ఫైల్ లో తమ ఖాతాలను వేసినా తిరిగి అధికారులు వారే ఓపెన్ చేసి పరిష్కరిస్తారని అందరూ అనుకున్నారు. కాకపోతే ఈ డమ్మీ ఫైల్ ఓపెన్ చేయడం ఎమ్మార్వో చేతిలో లేదు. కేవలం కలెక్టర్ చేతుల్లో మాత్రమే ఉంది. ఈమధ్య ధరణి పోర్టల్ లో రెట్టిఫికేషన్ కోసం ప్రభుత్వం మరలా ధరణిలో ఉన్న సర్దుబాటు చేయడం కోసం చర్యలు తీసుకుంది. దీంతో చాలామంది తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

ఒక్క గాంధారిలోనే వెయ్యి మంది దాకా ఉండొచ్చు....

ధరణి ద్వారా సర్దుబాటుల కోసం పట్టా పాస్ బుక్కుల్లో ఇంకా తమ భూమి ఎక్కలేదని కొందరు రైతులు, రి వెరిఫికేషన్ కోసం, వారసత్వ భూములు ఎక్కించుకోవడం కోసం చాలామంది తహసీల్దార్ ఆఫీస్ కు తిరుగుతూనే ఉన్నారు. అయితే దాదాపు డమ్మీ ఖాతా పేరుతో 5000 ఉన్న ఫోల్డర్ లో 450 కి పైగా సర్వే నంబర్లు ఉన్నాయి. అందులో ఇంకా /a,/ఆ,/అ కూడా ఉన్నాయి. ధరణిలో ఉన్న పొరపాట్లను త్వరగా పూర్తిచేయాలని రైతులు తమ గోడును వ్యక్తం చేస్తున్నారు.

పరిష్కారం చేస్తున్నాం : తహసీల్దార్ సతీష్

గాంధారి మండలలోని డమ్మీ ఖాతాలో ఉన్నటువంటి 450 పైగా సర్వే నంబర్లను ఒక్కొక్కటిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇప్పటికీ 6,7 కేసులు పరిష్కరించాం. ఈ స్పెషల్ డ్రైవ్ ఇలాగే కొనసాగుతుంది. అన్ని పరిష్కారం అయ్యేలా చూస్తాం. తెలపడం జరిగింది.

Advertisement

Next Story