ఆర్మూర్ లో బైక్ ను ఢీకొన్న డీసీఎం వ్యాన్

by Naveena |
ఆర్మూర్ లో బైక్ ను ఢీకొన్న డీసీఎం వ్యాన్
X

దిశ ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన ప్రసాద్ బైకును డీసీఎం ఢీ కొట్టింది. గురువారం మధ్యాహ్నం బైక్ పై ఆర్మూర్ వైపు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న యువకుడైన ప్రసాద్ కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం రోడ్డు ప్రమాద ఘటన నుంచి స్థానికులు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. వెనుక నుంచి బైక్ను ఢీ కొట్టి ప్రమాదానికి కారణమైన డీసీఎం వ్యాన్ డ్రైవర్ ప్రమాద సంఘటన స్థలం నుంచి పరారైనట్లు తెలిసింది.

Next Story