- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
5 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులు, ప్రాక్టికల్ పరీక్షలలో ఫెయిలైన విద్యార్థులకు ఈనెల 5 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. నిజామాబాద్ బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల ఇతర అన్ని కళాశాలలకు సంబంధించిన సైన్స్ గ్రూపులు, అన్ని ఒకేషనల్ గ్రూపులకు సంబంధించిన విద్యార్థులందరికి నిజామాబాద్ లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మాత్రమే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేశారు. కావున ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు, సంబంధిత గ్రూపుల అధ్యాపకులు విద్యార్థులకు విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆదేశించారు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్ లైన్ లోనే పొందాలని తెలియజేశారు.