- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్సారెస్పీలోకి 24 గంటల్లో 3 టీఎంసీల వరద
దిశ, బాల్కొండ : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 24 గంటలలో మూడు టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని ఏఈఈ వంశీ తెలిపారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో విష్ణు ప్రాజెక్టు నుంచి గత రెండు రోజులుగా విడుదల చేసిన మిగులు జలాలతో ఎస్సారెస్పీ రిజర్వాయర్లో నీటిమట్టం క్రమంగా పెరిగిందన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 1.25 నిమిషాలకు విష్ణుపురి ప్రాజెక్ట్ గేట్లను మూసివేయడంతో ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో తగ్గే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ నిర్మల్ జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాలలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులోకి వరద వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సీజన్లో ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్లోకి 57 టీఎంసీల వరద వచ్చిందన్నారు. కాకతీయ 3 వేలు, లక్ష్మి కాలువకు 50 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00అడుగులు 80.5 టిఎంసిలు సామర్థ్యం కాగా ఆదివారం నాటికి 1083. 50 అడుగులు 55 టీఎంసీల నీటి నిల్వ ఉందని ఎస్సారెస్పి అధికారులు తెలిపారు.