- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
17న ప్రజాపాలన దినోత్సవం
దిశ, కామారెడ్డి : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఈ నెల 17న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో ఎస్పీ సింధూ శర్మ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 17న తెలంగాణ ప్రజా పాలన కార్యక్రమాన్ని కలెక్టరేట్ లో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు శాఖల వారీగా కేటాయించిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, డీఎస్పీ నరసింహారెడ్డి, రాజారాం, మున్సిపల్ కమిషనర్ సుజాత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మహిళా శక్తి కార్యక్రమాల్లో ప్రగతి సాధించాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళా శక్తి కార్యక్రమాల్లో కామారెడ్డి జిల్లా ముందుండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకాంక్షించారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, సెర్ప్ డీపీఎం, ఏపీఎం, సీసీలతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళా శక్తి కార్యక్రమాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు తగిన ఉపాధి మార్గాల కోసం ఎంపిక చేసి బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి తదితర ఆర్థిక సంస్థల ద్వారా మహిళలకు రుణ అవకాశం కల్పించి ఆర్థికాభివృద్ధి పెంపొందించుటకు బలోపేతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మండలాల వారీగా రివ్యూ చేసి ప్రగతి సాధించడంలో వెనకంజలో ఉన్న మండలాలు త్వరలోనే ప్రగతి సాధించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాలను మండల అభివృద్ధి అధికారులు వారి మండలాల్లో సమీక్షించి వంద శాతం ప్రగతి సాధించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బ్యాంక్ లింకేజీ కింద తీసుకున్న రుణాలను వంద శాతం రికవరీ చేయాలని సీసీ లను ఆదేశించారు. ప్రగతి సాధించని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బి.రవికాంత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, శ్రీనిధి జిల్లా మేనేజర్ కిషోర్, పలు శాఖల అధికారులు, డీపీఎం., ఏపీడీలు, ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.