మాజీ..తాజా అయ్యేనా..కొలిక్కిరాని మున్సిపల్ చైర్మన్ నియామకం..?

by Aamani |
మాజీ..తాజా అయ్యేనా..కొలిక్కిరాని మున్సిపల్ చైర్మన్ నియామకం..?
X

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి పురపాలక చైర్మన్ అవిశ్వాసం పై నెగ్గిన 11 మంది కౌన్సిలర్లు.. కొలిక్కిరాని మున్సిపల్ చైర్మన్ నియామకం. .ఎల్లారెడ్డి పురపాలక పట్టణంలో పురపాలక చైర్మన్ గా బారాస పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్, సత్యనారాయణ, గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు ముఖ్య అనుచరుడిగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, బారాస పార్టీ ఓటమి చెందడంతో, మున్సిపల్ చైర్మన్ గా ఉన్న కుడుముల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీలో చేరడంతో, చైర్మన్ తో పాటు ఉన్న 11 మంది కౌన్సిలర్లు, పార్టీ మారిన చైర్మన్ పై, ఏప్రిల్ 24వ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానం బాల పరీక్ష, మే 18 వ తేదీన ప్రభుత్వ ఆదేశానుసారం, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎల్లారెడ్డి ఆర్టీవో, మన్నే ప్రభాకర్, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఆర్డిఓ అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయంలో మే 18 వ తేదీన, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది.

అవిశ్వాస తీర్మానంలో తమ,అవిశ్వాసం మద్దతు అందించిన, 11 మంది కౌన్సిలర్లు సమావేశంలో 9 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు చైర్మన్ సత్యనారాయణ పై అవిశ్వాసం తీర్మానంలో వ్యతిరేకంగా ఆయనపై నెగ్గారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అవిశ్వాస తీర్మాన ఫలితాలు ప్రకటించడం సరికాకపోవడంతో అధికారులు వివరాలు తెలుపలేదు. బారాస పార్టీలో ఉన్న ఐదుగురు కౌన్సిలర్లు వారం రోజుల క్రితం ఎమ్మెల్యే మదన్మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ల సంఖ్య, 8 కి చేరింది. బారాస పార్టీలో నలుగురు కౌన్సిలర్లు మిగిలిపోవడం తో, మరి మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీకి లభిస్తుందని, పట్టణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పురపాలక సంఘ చైర్మన్ గా నియామకమయ్యేనా, పదవి కాలం వృధాగానే గడిసేనా, అనే సందిగ్ధతపై ఎల్లారెడ్డి, పట్టణ ప్రజలు, అవాక్కవుతున్నారు.

బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరేనా.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి తమ పదవి కాలం కొనసాగించేనా..?

కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మదన్మోహన్ సమక్షంలో చేరిన ఎనిమిది మందిలో చైర్మన్ ఎవరు అనేదానిపై సందిగ్ధత నెలకొల్పుతుంది. పురపాలక పట్టణ ప్రజలు మాసాలలో ఉన్న చైర్మన్ పదవిని ఏ లేదు ఎవరు అనే దానిపై ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story