- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్షయ కంట్రోల్ లో ‘నిజామాబాద్’ భేష్.. మంత్రి హరీష్‌రావు
దిశ, తెలంగాణ బ్యూరో: క్షయ(టీబీ) కంట్రోల్ లో నిజామాబాద్జిల్లా ముందు వరుసలో ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, ఖమ్మం జిల్లాలు నిలిచాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌కు బంగారు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ లకు వెండి, ఖమ్మంకు కాంస్య పతకాలను ప్రకటించింది.టీబీ నియంత్రణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు ఈ జాతీయ అవార్డులు ఇస్తున్నట్లు పేర్కొన్నది.2015 కేసులతో పోల్చితే తెలంగాణలో టీబీ కేసుల తగ్గింపు ప్రతి లక్ష జనాభాకు గణనీయంగా తగ్గింది.
కేసుల తీవ్రత తగ్గింపు లక్ష్యం 80శాతం కాగా, 60 శాతం తగ్గించిన నిజామాబాద్ కు బంగారు పతకం,40 శాతం తగ్గించిన భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ లకు వెండి,20 శాతం తగ్గించిన ఖమ్మంకు కాంస్య పతకాలు వరించాయి. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో తెలంగాణ టీబీ విభాగం అధికారులు జెడి డాక్టర్ ఎ రాజేశం, నిజామాబాద్ డి ఎం హెచ్ వో సుదర్శనం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ శ్రీ గణ, ప్లానింగ్ ఆఫీసర్ వాసు ప్రసాద్ లు ఈ అవార్డులను అందుకున్నారు.టీబీ నిర్మూలన సూచికల ఆధారంగా, తెలంగాణ ప్రస్తుతం దేశంలో మూడవ ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.
స్పెషల్ప్లాన్..
రాష్ట్రంలో టీబీ వ్యాధిని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. టీబీ పరీక్షల సంఖ్య భారీగా పెంచడంతోపాటు వైద్య సహాయం తక్షణమే అందించేందుకు ఏర్పాట్లు చేసింది. కుటుంబంలో ఒక్కరికి టీబీ గుర్తిస్తే మిగతా సభ్యులకు కూడా పరీక్షలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిని అపెక్స్ టీబీ ఆసుపత్రిగా గుర్తించడంతో పాటు మల్టీ డ్రగ్ థెరపీ, డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ చికిత్స పొందేవారి కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నది. టీబీ నోటిఫైబుల్ డిసీజ్ కావడంతో ప్రైవేటు లో గుర్తించిన కేసులకు కూడా పూర్తి ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు వైద్యం అందిస్తున్నారు. అన్ని కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులతో కలిసి రాష్ట్ర టీబీ విభాగం సమన్వయంతో పని చేస్తున్నది.
ఇక టీబీ నుంచి కోలుకున్నవారిని ఛాంపియన్స్ గా గుర్తించి శిక్షణ ఇచ్చి, వారి ద్వారా ప్రజల్లో వ్యాధిపై అవగాహన తెస్తున్నారు. ఈ టీబీ ఛాంపియన్స్ ప్రత్యేక మొబైల్ యాప్ దీక్ష ద్వారా ఆన్ లైన్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. టీబీ వ్యాధిబారిన పడినవారికి ప్రభుత్వం ‘‘ నిక్షయ్ పోషణ యోజన’’ కింద పోషకాహారం కోసం ప్రతి నెల రూ.500 చొప్పున వ్యాధి నుంచి బయటపడే వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. మరోవైపు టీబీ తీవ్రత ఎక్కువగా ఉండి మల్టి డ్రగ్ థెరపీ తీసుకునేవారికి రూ.1200 రవాణా ఛార్జీలు, గిరిజన ప్రాంతాలతో వీటికి అదనంగా మరో రూ.750 అందిస్తున్నారు. అంతేగాక బాధితులకు పోషకాహార కిట్స్ అందిస్తున్నారు.
2025 నాటికి పూర్తి స్థాయి నిర్మూలనే లక్ష్యం
టీబీ నియంత్రణలో సత్తా చాటి అవార్డులు పొందిన జిల్లాలకు శుభాకాంక్షలు జఇందుకు కృషి చేసిన వైద్యాధికారులను అభినందనలు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణలో 2025 నాటికి పూర్తి స్థాయిలో క్షయ వ్యాధి (టీబీ) నిర్మూలనే లక్ష్యంగా నిర్ధేశించుకుని పరీక్షలు, వైద్యం వేగవంతం చేస్తున్నాం.2025 వరకు టీబీ నిర్మూలన లక్ష్యం దిశగా వైద్యశాఖ పనిచేస్తుంది. ప్రజలంతా సహకరించాలి. ’’