ఆ విషయంలో నిజాం కళాశాల విద్యార్థుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు

by Indraja |
ఆ విషయంలో నిజాం కళాశాల విద్యార్థుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు
X

దిశ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలలనే తేడా లేకుండా విద్యార్థులు ఆహారం విషయంలో ఇబ్బందలను ఎదుర్కొంటున్నారు. నిన్న రాత్రి మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు అన్నం, స్వీట్ లో పురుగులు వచ్చాయని ఆందోళనకు దిగారు. ఇక ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే నిజాం కళాశాల విద్యార్థులు నిరసన చేపట్టారు.

వసతి గృహంలో నాణ్యమైన ఆహారం అందించాలని.. అలానే మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బషీర్‌బాగ్‌లోని వసతి గృహం ముందు నిరసనకు దిగారు. వీ వాంట్ జస్టిస్, నాణ్యమైన ఆహారం అందించాలని.. కళాశాల ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన నినాదాలు ఆ ప్రాంతమంతా మారుమోగాయి.

కాగా విద్యార్థులు నిరసన వల్ల రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనితో ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ను నియంత్రించడాని రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. న్యాయం కోసం నిరసన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసారు.

Advertisement

Next Story

Most Viewed