ఉద్యమంలో జైలుకు వెళ్లడం వేరు దగా చేసి జైలుకెళ్లడం వేరు కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్

by Disha Web Desk 13 |
ఉద్యమంలో జైలుకు వెళ్లడం వేరు దగా చేసి జైలుకెళ్లడం వేరు కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని నిజానికి ఏదైనా అనిశ్చిత పరిస్థితి ఉందా అంటే అది బీఆర్ఎస్ లో, కేసీఆర్ కుటుంబంలో ఉందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయి రోజులు గడుస్తున్నా ఆమెకు బెయిల్ వస్తుందా లేదా అనే విషయంలో అనిశ్చితి ఉందని ఎద్దేవా చేశారు. మంగళవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధం అంటున్నారు.. కానీ రాజకీయంగా ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లడం వేరు మోసం చేసి దగా చేసి జైలుకు వెళ్లడం వేరు ఈ సంగతి కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో సుస్థిరమైన బలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. దేశంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నదని ఆ ప్రభుత్వంలో నామా నాగేశ్వరరావు మంత్రి అవుతారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే కేసీఆర్ ఏ రకమైన కలలు కంటున్నారో అర్థం అవుతోందని ఆయనకు సానుభూతి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ తానే తెచ్చానని ప్రజలను మభ్య పెడుతూ అధికారంలోకి వచ్చి ఎన్ని ఎకరాల భూములు తన వారికి, ఆంధ్రవారికి కట్టబెట్టారో కేసీఆర్ నిజ స్వరూపం ప్రజలను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారన్నారని ధ్వజమెత్తారు.

Next Story