- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలోనే అరుదైన.. 'జెనెటికల్ డిజార్డర్' ను కనుగొన్న నిమ్స్ వైద్యులు
దిశ, వెబ్ న్యూస్: నిమ్స్ వైద్యులు.. సరికొత్త జెనెటికల్ డిజార్డర్ కనుగొన్నారు. ప్రపంచంలో ఇలాంటి ఒక డిజార్డర్ ఉన్నట్లు గుర్తించడం ఇదే తొలిసారి అని.. ఇకపై ఇలాంటి డిజార్డర్ తో బాధపడుతున్నవారికి చికిత్స అందించేందుకు ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుందని నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ బీరప్ప వెల్లడించారు. నిమ్స్ జెనెటిక్స్ వింగ్, సీడీఎఫ్(సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్) కలిసి సంయుక్తంగా ఈ పరిశోధన చేసినట్లు అయన తెలిపారు. అయితే ఇటీవల.. శరీర అవయవాలు, ఇతర భాగాల్లో నీరు పేరుకుపోయి, పిల్లలు చిన్న వయస్సులోనే చనిపోతున్న ఓ కుటుంబం నిమ్స్ వైద్యులను సంప్రదించింది.
అయితే... ఆ సంబంధిత కుటుంబంలోని మహిళకు అబార్షన్ జరిగి, బయటకు తీసిన రెండు పిండాల(ఫీటస్)పై నిమ్స్ డాక్టర్లు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో నిమ్స్ జెనెటిక్స్ వింగ్ హెచ్ఓడీ షాగున్ అగర్వాల్, అడిషనల్ ప్రొఫెసర్ ప్రజ్ఞా రంగనాథ్, సీడీఎఫ్డీ వైద్యులు అశ్విన్ దళాల్, రష్ణ బండారి ఇంకా ఇతర వైద్య బృందం పాల్గొన్నారు. ఈ పరిశోధన అనంతరం వైద్య బృందం కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మానవ శరీరంలో ఉండే "సెర్పినా-11" అనే జన్యువులో ఉత్పరివర్తనలు (జెనెటిక్ మ్యుటేషన్స్) జరుగుతున్నాయని.. ఈ ఉత్పరివర్తనల వల్ల శరీరంలో ఉన్న అవయవ కణజాలాలు(టిష్యూస్), ఇతర శరీర భాగాల కణజాలాలు దెబ్బతింటున్నాయని తాము గుర్తించినట్లు తెలిపారు. దీనివల్ల నోవల్ సెర్పినోపథి (పేరెంటల్ లీథల్ డిజార్డర్) అనే కండిషన్ కు గురై.. పిల్లల శరీరంలో, ఇంకా అవయవాలలో నీరు పేరుకొనిపోయి, వారు ప్రారంభ దశ(ఎర్లీ ఏజ్) లోనే చనిపోతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇలాంటి ఒక అరుదైన జన్యు రుగ్మత(జెనెటికల్ డిజార్డర్) ను గుర్తించడం ప్రపంచంలోనే తొలిసారి అని క్లినికల్ జెనెటిక్స్ జర్నల్ ప్రకటించిందని నిమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఈ పరిశోధనకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, నిమ్స్ వైద్యులను ప్రత్యేకంగా అభినందించినట్లు తెలుస్తోంది.