- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MLA Rama Rao Patel:బాసర ట్రిపుల్ ఐటీలో సౌకర్యాలు నిల్.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవని, తాగేందుకు మంచి నీరు కూడా దొరకని సందర్భాలు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం కింద బాసర ట్రిపుల్ ఐటీలో స్వాతి ప్రియ అనే యువతి ఆత్మహత్య చేసుకుందన్నారు. ఇది తెలిసి ఏబీవీపీ కార్యకర్తలు వెళ్తే అక్కడి సెక్యూరిటీ గార్డ్, పోలీసులు కొట్టారని, తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు. దీంతో చలో బాసర ట్రిపుల్ ఐటీకి పిలుపునిస్తే.. ఏబీవీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని ఫైరయ్యారు. స్వాతి ప్రియ ఆత్మహత్యకు కారణాలేంటో బయటపెట్టాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు భోజనం కూడా సరిగా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ట్రిపుల్ ఐటీలో సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.