- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆధిపత్యం కోసం పట్టు పట్టిన ఇరు వర్గాలు..
దిశ, గద్వాల ప్రతినిధి : వడ్ల కొనుగోలు సెంటర్ లను ఐకేపీ సెంటర్ ద్వారా రైతుల నుండి వడ్ల కొనుగోలు ప్రభుత్వం నిర్వహిస్తుండగా గద్వాల మండలం బీరోల్లి గ్రామంలో అధికార పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి వడ్ల కొనుగోలు సెంటర్ లో గొడవకు దిగారు. వడ్ల కొనుగోలు సెంటర్ తమ వర్గానికే ఇవ్వాలని కొనుగోలు సెంటర్ ప్రారంభం కాకుండా ఇరువర్గాలు ఘర్షణకు దిగారు.
గత సంవత్సరం మహిళా సంఘాల వారికే వడ్ల కొనుగోలు సెంటర్ ను ఈ సంవత్సరం కూడా ఇవ్వాలని కొందరు పట్టు పడగా.. రాజకీయ కారణంగానే బీరోల్లి గ్రామ కొనుగోలు సెంటర్ ను ఈ సంవత్సరం వేరే మహిళా గ్రూప్ లకు ఇచ్చారని గత సంవత్సర మహిళా సంఘాల గ్రూప్ వారు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా గద్వాల నియోజకవర్గంలో అధికార పార్టీలోని నాయకులు రెండు వర్గాలుగా విడిపోవడంతో గ్రామాల్లో కూడా రెండు వర్గాలుగా కార్యకర్తలు, నాయకులు విడిపోయి ఆధిపత్య పోరుతో గ్రామాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది.