విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలో దూకిన వ్యక్తి

by Jakkula Mamatha |   ( Updated:2024-11-21 09:01:50.0  )
విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలో దూకిన వ్యక్తి
X

దిశ,వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లా ఈపూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈపూరు మండలంలో విలేకరిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇద్దరు ఆడ పిల్లలతో కలిసి ఆరేపల్లి ముప్పాళ్ళ వద్దనున్న సాగర్ కెనాల్‌ పెద్ద కాలువలో దూకాడు. ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో పిల్లలతో కలిసి కాలువలో దూకాడు. దీంతో ఇద్దరు పిల్లలు నీటిలో కొట్టుకుపోయారు. అయితే ఈ ఘటనను గమనించిన స్థానికులు అతడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఈ విషాద ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed