- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BRS: రేవంత్ రెడ్డి ఇవి కూడా మీ ఖాతాలోకేనా..? హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇవి కూడా మీ ఖాతాలోనే వేసుకుంటారా అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS leader Harish Rao) ఎద్దేవా చేశారు. తొమ్మిది నెలల శిక్షణ అనంతరం కానిస్టేబుళ్ల(Constables)కు ఇవాళ పాసింగ్ అవుట్ పరేడ్(Passing Out Parade) కార్యక్రమం నిర్వహించారు. దీనిపై ఎక్స్ లో స్పందించిన హరీష్ రావు.. రేవంత్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS govt) నిర్వహించిన పోలీసు పరీక్షల్లో(Police Exam) ఎంపికై, ఉద్యోగాలు పొంది 9 నెలల శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరబోతున్న 8,047 పోలీసు కానిస్టేబుల్ లకు శుభాకాంక్షలు(Best Wishes) అంటూ రాసుకొచ్చారు.
అలాగే నీతి, నిజాయితీలతో వ్యవహరిస్తూ, శాంతి భద్రతలు కాపాడటంలో నిమగ్నం కావాలని, ఉద్యోగ నిర్వహణలో రోల్ మోడల్(Roll Model) గా నిలవాలని ఆకాంక్షించారు. ఇక నోటిఫికేషన్లు(Notifications) ఇవ్వకుండానే పది నెలల్లో 50వేల ఉద్యోగాలు భర్తీ చేశామని గోబెల్స్(Gobels) ప్రచారం మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి! ఇవి కూడా ఆయన ఖాతాలోనే వేసుకుంటారేమోనని మాజీ మంత్రి విమర్శలు చేశారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధకారంలోకి వచ్చాక ఎంపికైన కానిస్టేబుళ్లకు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ నగర్ లో సభ ఏర్పాటు చేసి నియామక పత్రాలు అందజేశారు.