Tribal Woman: ట్రైబల్ మహిళపై ఇంత దారుణమా?.. ఛాతీపై తన్ని.. నోటిలో మలం కుక్కి..

by Rani Yarlagadda |
Tribal Woman: ట్రైబల్ మహిళపై ఇంత దారుణమా?.. ఛాతీపై తన్ని.. నోటిలో మలం కుక్కి..
X

దిశ, వెబ్ డెస్క్: టెక్నాలజీ యుగంలో ఉన్నాం. టెక్నాలజీలో దూసుకెళ్తున్నాం. కానీ.. ఎంత టెక్నాలజీ అప్డేట్ అయినా ఏం లాభం. ఇంకా కొన్ని అట్టడుగు వర్గాలపై కుల విబేధం మాత్రం తగ్గట్లేదు. తమకంటే తక్కువ కులాల వారు కనిపిస్తే.. కులం పేరుతో తిట్టడం, వారిని వేధించడం వంటి పనులు చేస్తూనే ఉన్నారు కొందరు కులగజ్జి అంటుకున్నవారు. తాజాగా ఒడిశాలో 20 ఏళ్ల ట్రైబల్ మహిళ (Tribal Woman Assault) పట్ల దారుణంగా ప్రవర్తించాడో దుర్మార్గుడు. నవంబర్ 16న బాధిత మహిళ గ్రామంలోని చెరువులో స్నానం చేసి వెళ్తుండగా.. ఆమెపై అదే గ్రామానికి చెందిన అభయ్ బాగ్ దారుణానికి పాల్పడ్డాడు.

బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. స్నానం చేసి వెళ్తున్న ఆమెను అభయ్ అడ్డుకున్నాడు. ఆమె ఛాతీపై కొట్టడంతో కింద పడిపోయింది. ఆపేందుకు ఆమె తల్లి ప్రయత్నించగా.. గొంతు నొక్కి.. కులం పేరుతో దూషించాడు. ఆపై బాధిత మహిళ ముఖంపై అభయ్ మలం పూసి.. బలవంతంగా దానిని తినిపించే ప్రయత్నం చేశాడు. అంతకుముందు అతడు బాధిత మహిళ పంటభూమిలో ట్రాక్టర్ నడిపి.. పంటనంతా పాడు చేశాడు. అందుకు మహిళ నిరసన చేయగా.. దానికి ప్రతీకారంగా తనపై ఇలా దాడి చేశాడని వాపోయింది.

బంగోముండ (Bangomunda) పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని కాంతాబంజీ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) గౌరంగ్ చరణ్ సాహు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. లేదంటే నిరసనలు చేపడుతామని గిరిజన సంక్షేమ సంఘం సభ్యులు హెచ్చరించారు. స్థానిక సామాజిక కార్యకర్త అజిత్ జోషి దాడిని ఖండించారు, ఇది "నిందనీయమైన చర్య" అని అభివర్ణించారు. ఎలాంటి జాప్యం లేకుండా, ప్రలోభాలకు తలొగ్గకుండా నిందితులను అరెస్టు చేసి న్యాయం చేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరారు.

Advertisement

Next Story

Most Viewed