UNICEF report: 2050 నాటికి భారత్ లో 35 కోట్ల మంది చిన్నారులు.. ఆందోళనకరంగా యూనిసెఫ్ నివేదిక

by Shamantha N |
UNICEF report: 2050 నాటికి భారత్ లో 35 కోట్ల మంది చిన్నారులు.. ఆందోళనకరంగా యూనిసెఫ్ నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ లోని చిన్నారుల గురించి యూనిసెఫ్(UNICEF) నివేదిక విడుదల చేసింది. పర్యవారణం, వాతావరణమార్పులు(Extreme weather) వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కామెంట్స్ చేసింది. భారత్‌లో 2050 నాటికి 35 కోట్ల మంది(350 million children) చిన్నారులుంటారని, వారు తీవ్ర వాతావరణ, పర్యావరణ ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందంది. వారి హక్కులు, భవితను రక్షించడానికి ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే విధానాలను ప్రభుత్వాలు రూపొందించాలని సూచించింది. 2050 నాటికి ప్రపంచ పిల్లల జనాభాలో 15 శాతం భారత్‌, చైనా, నైజీరియా, పాకిస్థాన్‌లోనే ఉంటారని తెలిపింది. ‘మారుతున్న ప్రపంచంలో పిల్లల భవిత’ పేరిట బుధవారం ఈ నివేదికను విడుదల చేసింది. జనాభాలో మార్పులు, వాతావరణ సంక్షోభాలు, కొత్త సాంకేతికతలు అనే ధోరణులు పిల్లల జీవితాలను నిర్దేశిస్తాయని తెలిపింది. భారత చిన్నారులు ముఖ్యంగా గ్రామీణ, మధ్య ఆదాయ వర్గాలవారు తీవ్రమైన వేడి, వరదలు, వాయు కాలుష్య ప్రమాదాల బారిన పడతారని చెప్పింది.

8 రేట్లు ఎక్కువ వేడి

ఈ నివేదికను యునిసెఫ్ భారత ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ, ది ఎనర్జీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (టెరీ)కి చెందిన సురుచి భద్వాల్‌తో కలిసి యూనిసెఫ్ యూత్ అడ్వకేట్ కార్తీక్ వర్మ ఆవిష్కరించారు. 2050ల నాటికి, పిల్లలు విపరీతమైన వాతావరణం, పర్యావరణ ప్రమాదాలకు గురికావడం పెరుగుతోందన్నారు. 2000 సంవత్సరంతో పోలిస్తే దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ మంది పిల్లలు తీవ్రమైన వేడి తరంగాలకు గురవుతారని నివేదికలో ఉంది. ఈ సమస్యలను తగ్గించడానికి పిల్లలకు సురక్షితమైన, సమానమైన ప్రాప్యతను నిర్ధారించడానికి సమగ్ర సాంకేతిక పురోగతికి పిలుపునిచ్చింది. ఆరోగ్యం, విద్య, నైపుణ్యం, స్థిరమైన పట్టణ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులకు భారతదేశం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని తెలిపింది. భారతదేశంలోని జనాభాలో దాదాపు సగం మంది 2050 నాటికి పట్టణ ప్రాంతాలలో నివసిస్తారని.. అందుకు అనుకూలమైన వాతావరణాన్ని తట్టుకునే ప్రణాళిక అవసరమంది.

Advertisement

Next Story

Most Viewed