- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన ప్రక్రియ ప్రారంభం
దిశ, వెబ్‌డెస్క్: దామగుండం నేవీర రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభమైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ రాడార్ స్టేషన్ శంకుస్థాపన ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటల 55 నిముషాలకు జరిగింది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు కానుంది. దేశంలోనే అతిపెద్ద రెండో వీఎల్‌ఎఫ్ నేవీ రాడార్ సెంటర్‌గా దీన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది.
కాగా.. 12:30కు శంకుస్థాపన స్థలానికి చేరుకున్న రాజన్‌నాథ్ సింగ్‌కు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు మరికొంతమంది బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కూడా శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేరుకుని ప్రసంగించారు.
ఇదిలా ఉంటే 10 ఏళ్ల క్రితమే రాడార్ సెంటర్ ఏర్పాటు ప్రక్రియను కేంద్రం ప్రారంభించినా.. బీఆర్ఎస్ హయాంలో అనుమతులన్నీ లభించినా స్థల కేటాయింపు వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇక తాజాగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక దామగుండం ఫారెస్ట్ ఏరియాలో 2900 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో రాడార్ సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.