Kokapet: యథేచ్చగా రూ.70 కోట్ల భూమి కబ్జా

by srinivas |   ( Updated:2024-12-12 04:11:07.0  )
Kokapet: యథేచ్చగా రూ.70 కోట్ల భూమి కబ్జా
X

దిశ, శంషాబాద్ : రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరితెగించారు. ఏకంగా రూ.70 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రెవెన్యూ పరిధిలోని ఎయిర్ పోర్ట్ ఫ్లైఓవర్ కోసం 2007 సంవత్సరంలో సర్వే నంబర్ 289, 283, 287, 295, 294, 289, 285, 83, 82లో ఉన్న భూములను అప్పటి ప్ర భుత్వం వారికి నష్టపరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుంది. అయితే ఎయిర్ పోర్ట్ ఫ్లైఓవర్ ర్యాంపుకు సంబంధించి ని ర్మాణం చేపట్టిన అనంతరం మిగిలిన 3 ఎకరాల 35 గుంటల హెచ్ఎండీఏ భూ ములు ఖాళీగా ఉండడంతో రియల్ ఎస్టే ట్ వ్యాపారులు, అక్రమార్కులు బరితెగించి ఆ స్థలాల్లో యథేచ్ఛగా ధర్మ కంట నిర్మాణంతో పాటు ఓ ప్రజాప్రతినిధి భారీ హోర్డింగ్ నిర్మాణం చేపట్టాడు. మిగిలిన స్థలాలను లీజుకు ఇచ్చి అక్కడ హోటల్స్ నిర్మాణం చేసి ప్రభుత్వ భూముల్లో కోట్లు సంపాదిస్తున్నారు.

ఇంత జరుగుతున్నా హెచ్ఎండీఏ, మున్సిపల్, రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రభుత్వ భూముల్లో ని ర్మించిన అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు సైతం ఇంటి నంబర్లు జారీ చేసి టాక్సులు వసూలు చేయడం గమనా ర్హం. ఈ తతంగం జాతీయ రహదారి పక్కనే జరుగుతుండగా, నిత్యం వీఐపీలు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్, ఐఏ ఎస్, ఐపీఎస్ అధికారులు పక్కనే కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా చేసి 111 జీవోకు విరుద్ధంగా అక్రమ నిర్మా ణాలు చేపడుతుంటే కనిపించలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

ప్రభుత్వ భూములను కాపాడి బోర్డు ఏర్పాటు చేయాలి: స్థానికులు

2007 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం బ్రిడ్జి ర్యాంపు నిర్మాణం కోసం భూము లను స్వాధీనం చేసుకుంది. మిగిలిన భూముల్లో స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ నిర్మాణాలు చేపట్టి లక్షలు సంపాదిస్తున్నారు. ఇదంతా రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసి నిర్మాణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తు న్నారు. భూములను స్వాధీనం చేసుకొని ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేసి భూ ములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రభుత్వ భూముల్లో భారీ హోర్డింగ్..

హెచ్ఎండీఏ భూముల్లో భూమి యజమానికి ప్రభుత్వం నష్టపరిహారం చె ల్లించడంతో ఆ యజమాని ఆ భూమి నుం చి వెళ్లిపోయాడు. దీంతో ఇదే అదు నుగా శంషాబాద్ మున్సిపల్‌లో ఉన్న ఓ ప్రజా ప్రతినిధి ఆ భూమి నా దని, ప్రభుత్వ భూమిలో ఎలాంటి అ నుమతి లేకుండా అక్రమంగా ఓ నియోజకవర్గ ప్రజాప్రతితో ఫోన్లు చేయించి భారీ హోర్డింగ్ నిర్మించి అక్రమార్జనకు తెర లేపారు. ఇటీవల వచ్చిన హెచ్ఎండీఏ అధికారులు కూల్చి వేయడానికి వస్తే వారిపై ఆగ్ర హం వ్యక్తం చేయడంతో హెచ్ఎండీఏ అధికారులు భూమికి సంబంధించి పత్రాలు తీసుకురావాలని చెప్పడంతో తీసుకొస్తానని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ హోర్డింగ్‌కు మున్సిపల్ అధికారులు సైతం టాక్స్ వసూలు చేయడం, విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కనెక్షన్ ఇవ్వడంలో ఎవరి పాత్ర ఎంతో అర్థం చేసుకోవచ్చు.

అధికారుల హడావిడి..

గతంలో స్థానికులు ఫిర్యాదు చేయ డంతో హెచ్ఎండీఏ అధికారులు కూ ల్చివేస్తామంటూ హడావిడి సృష్టించా రు. తూతూ మంత్రంగా కూల్చివేసి వె ళ్లిపోయారు. అయితే ఇదే అదునుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపో తూ అక్రమ నిర్మాణాలకు తెరలేపి ప్రభుత్వ భూముల్లో కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పటికైనా హెచ్ఎండీఏ, రెవె న్యూ, మున్సిపల్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed