- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో కేటీఆర్‌కు అరుదైన ఆహ్వానం అందింది. ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం వచ్చింది. 2024లో ఫిబ్రవరిలో ఇండియా కాన్ఫరెన్స్ సదస్సులో పాల్గొనాల్సిందిగా హార్వర్డ్ యూనివర్సిటీ కేటీఆర్‌ను ఆహ్వానించింది. కాన్ఫరెన్స్‌లో భాగంగా ఇండియా రైసింగ్-బిజినెస్, ఎకానమీ, కల్చర్ థీమ్‌తో సదస్సు జరగనుంది.
ఈ సదస్సుకు కేటీఆర్‌ను ఆహ్వానించారు. దీనిపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తనను ఆహ్వానించడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలంగాణ అభివృద్ది విధానాలను వివరించేందుకు మంచి అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో కేటీఆర్ బిజీబిజీగా ఉన్నారు. రోజుకో ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్‌ను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. అంతేకాకుండా ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు.