- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉప్పల్- ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ పై కొత్త టెండర్లు!.. మంత్రి కోమటిరెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: ఉప్పల్ ఫ్లై కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్- విజయవాడ హైవేను ఆరు లేన్ల రోడ్డు గా మార్చాలని మంత్రి నితిన్ గడ్కరీని అడగం జరిగిందని, దానిపై త్వరలోనే మీటింగ్ పెట్టి పరిశీలిస్తామని, అలాగే రీజనల్ రింగ్ రోడ్ అంశంపై కూడా త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేసి రివ్యూ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అంతేగాక గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడ్డ 16 రోడ్లపై వారికి నివేదిక ఇచ్చామని, వాటిలో కొన్నింటిని హైవేలుగా మార్చాలని కోరడంతో దానిపై సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు.
భారత్ మాల స్థానంలో కొత్త ప్రాజెక్టు తీసుకొస్తున్నామని, తదనంరం ఏర్పాటు చేసే మీటింగ్ లో వీటిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసినట్లు తెలిపారు. అలాగే ఉప్పల్- ఘట్ కేసర్ ఫ్లై ఓవర్ పనులు గత ఆరేళ్లలో 40 శాతం మాత్రమే పూర్తి అయ్యాయని, దానిని వారి దృష్టికి తీసుకెళ్తే.. ఫ్లై ఓవర్ నిర్మాణం పై ఉన్న టెండర్లను వెంటనే టర్మినేట్ చేసి.. కొత్త టెండర్లకు ప్రకటన ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం బండి సంజయ్ గారిని, రేపు కిషన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరామని, అనంతరం భూపేంద్ర యాదవ్ గారిని కూడా కలవాల్సి ఉందన్నారు.
గడ్కరీ గారు పార్టీలకు అతీతంగా ఆలోచించి సమస్యలపై ఎవరు వచ్చిన వెంటనే పరిష్కరించే వ్యక్తి అని, హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా గా కూడా పేరు పొందారని అన్నారు. వారి సహకారంతో తెలంగాణ లో రోడ్లను జాతీయ రహదారులుగా మార్చుకుంటామని, విజయవాడ హైవే త్వరగా పూర్తి చేసుకుంటామని, రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో నార్తర్న్ పార్ట్ కి నంబర్ ఇచ్చామని, సదరన్ పార్ట్ కు నంబర్ ఇవ్వలేదని, కొన్ని ఇష్యూస్ ఉండటంతో ఆగడం జరిగిందని తెలిపారు. మళ్లీ వారు రహదారుల మంత్రి కావడంతో వారిని సత్కరించామని, మొదటి మీటింగ్ లోనే కొన్ని పనులకు సానుకూలంగా స్పందించి ఆదేశాలివ్వడం సంతోషంగా ఉందని, తప్పకుండా మొదటి మూడు సంవత్సరాలలో సీఎం గారి సహకారంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, తెలంగాణలో పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటామని కోమటిరెడ్డి అన్నారు.