- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
New parliament building inauguration : సెంగోల్ (రాజదండం) ప్రత్యేకతలివే..!
దిశ, వెబ్‌డెస్క్: కొత్త పార్లమెంట్ నూతన భవనాన్ని నేడు ప్రధాని ప్రారంభించారు. అయితే ప్రధాని ప్రతిష్టించిన సెంగోల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని సెంగోల్(రాజదండాన్ని) కొత్త పార్లమెంట్ భవనంలో ప్రతిష్టించడంతో దీని గురించి పలువురు ఆరా తీస్తున్నారు. తమిళ పదం సెమ్మై నుంచి ఈ పదం ఏర్పడింది. సెమ్మై అంటే ధర్మం అని అర్థం. మరి దాని విశేషాలేంటో మనం కూడా తెలుసుకుందాం. బ్రిటీషర్లు, భారతీయల మధ్య జరిగిన అధికార బదిలీకి ఈ రాజదండాన్ని వినియోగించారు. బ్రిటీష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్.. భారత దేశ తొలి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూకి తొలిసారిగా ఈ రాజదండాన్ని అందించారు.
అధికార మార్పిడికి చిహ్నంగా ఏం చేద్దామని మౌంట్ బాటెన్.. నెహ్రూను ప్రశ్నించగా ఆయన రాజాజీ అడ్వైస్ కోరారు. దీంతో ఆయన తమిళ సంప్రదాయాన్ని అనుసరిస్తూ రాజదండాన్ని తయారు చేయాలని నిర్ణయించారు. మద్రాస్ లో ఆనాడు ఓ స్వర్ణకారుడు దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ రాజదండం ఐదు అడుగులు పొడవు ఉండగా పై భాగంలో నంది విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ రాజదండాన్ని న్యాయానికి ప్రతీకగా రూపొందించారు. ఆగస్ట్ 14 రాత్రి 10.45 గంటల సమయంలో నెహ్రూ ఈ రాజదండాన్ని స్వీకరించారు. బ్రిటీషర్ల నుంచి దేశ ప్రజలకు అధికార మార్పిడి చిహ్నంగా దీన్ని నెహ్రూ అందుకున్నారు. రాజదండం సాక్షిగా ఆనాడు అధికార మార్పిడి జరిగింది.