రేవంత్ రెడ్డి చేసిన పనికి దటీజ్ సీఎం అంటున్న నెటిజన్లు.. ఏం చేశారంటే?

by Hamsa |   ( Updated:2023-12-16 07:49:32.0  )
రేవంత్ రెడ్డి చేసిన పనికి దటీజ్ సీఎం అంటున్న నెటిజన్లు.. ఏం చేశారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రజావాణిలో ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారు. అలాగే ఆరు గ్యారంటీ పథకాల అమలుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎక్కడైనా సీఎం వస్తున్నారంటే పదిహేను నిమిషాల ముందు నుంచే పూర్తిగా వాహనాలను ఆపేస్తారు. దీంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే ప్రజలు ఇబ్బంది పడకూడదని రేవంత్ రెడ్డి శుక్రవారం తనకోసం ట్రాఫిక్‌ను ఆపవద్దని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. తన కోసం ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్‌ను తీసుకెళ్లాలని సూచించారు.

సాధారణ ట్రాఫిక్‌లోకి తన కాన్వాయ్‌ను అనుమతించాలని రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు. దీంతో ఇది ఎంత వరకు పాటిస్తాడో అని నెట్టింట చర్చలు మొదలయ్యాయి. తాజాగా, నేడు అసెంబ్లీ సమావేశాలకు రేవంత్ రెడ్డి సాధారణ వాహనాలతో కలిసి వెళ్లినట్లు సమాచారం. జూబ్లీహిల్స్‌లోని తన సొంత ఇంటి నుంచి నాగార్జున్ సర్కిల్, పంజాగుట్ట, ఖైరతాబాద్ మీదుగా ఆయన అసెంబ్లీకి ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు దటీజ్ తెలంగాణ సీఎం అని రేవంత్ రెడ్డిపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా నిన్న చెప్పాడు.. నేడు చేశాడు అని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed