Where is KCR?: ముందు కేసీఆర్ ఎక్కడో చెప్పండి.. సోషల్ మీడియా ప్రచారంపై నెటిజన్ల ఆగ్రహం

by Prasad Jukanti |   ( Updated:2024-09-02 15:23:55.0  )
Where is KCR?: ముందు కేసీఆర్ ఎక్కడో చెప్పండి.. సోషల్ మీడియా ప్రచారంపై నెటిజన్ల ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజాజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు వీలైనంత వేగంగా సహాయక చర్యలు అందించేందుకు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పని చేస్తున్నది. ఇదిలా ఉంటే మరో వైపు బీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులపై నెటిజన్లు మండిపడుతున్నారు. సీఎం, మంత్రులు సహా కాంగ్రెస్ నాయకులు గతంలో ప్రతిపక్షంలో ఉండగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ప్రస్తుతం వరదల సమయంలో వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తున్న మంత్రులు అంటూ పాత వీడియోలను సర్క్యూలేట్ చేస్తున్నారు. దీంతో వరదల సమయంలో ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఏంటి అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫేక్ ప్రచారం మాట అలా ఉంచితే ఇంతకు మీ నాయకుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన తీరు మారలేదని ప్రజలు వరదలతో విలవిల్లాడుతుంటే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదని నిలదీస్తున్నారు. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తామని గప్పాలు కొట్టిన కేసీఆర్ ఇప్పటికీ ఫాంహౌస్ కే పరిమితం అయ్యారని విమర్శిస్తున్నారు. గతంలో మాట్లాడిన మాటలను మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టడం వల్ల మీ పార్టీకి ఏం లాభం రాదని వీలైతే ఏదైనా సాయం చేస్తే మంచిదని నెటిజన్లు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed