Government Hospital: ఒకరి బేబీని మరొకరికి ఇచ్చిన ఆస్పత్రి సిబ్బంది

by Gantepaka Srikanth |
Government Hospital: ఒకరి బేబీని మరొకరికి ఇచ్చిన ఆస్పత్రి సిబ్బంది
X

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల(Jagtial) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)లో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువు(Newborn baby)లను తారుమారు చేశారు. ట్యాగ్‌లను చూసుకోకుండా ఒకరి బేబీని మరొకరికి ఇచ్చారు. డ్రెస్సింగ్ టవల్(Dressing towel) తమది కాదని చెప్పినా వినిపించుకోకుండా తారుమారు చేశారని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు జరిగిన పొరపాటును గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది తర్వాత ఎవరి బేబీలను వారికి అప్పగించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story