- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అగ్రరాజ్యంలో తెలుగు సంబరాలు.. CM రేవంత్‌కు ఆహ్వానం

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America)లోని ప్రముఖ తెలుగు సంఘం 'నాట్స్'(NATS) ప్రతి రెండేళ్లకోసారి అంగరంగ వైభవంగా నిర్వహించే తెలుగు సంబరాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఆహ్వానం అందింది. ఫ్లోరిడాలోని టంపా వేదికగా జూలై 4, 5, 6 తేదీల్లో నిర్వహించనున్న 8వ 'నాట్స్' అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతూ 'నాట్స్' బృందం ఆహ్వాన పత్రికను అందించింది.
అమెరికాలో తెలుగువారందరూ కలిసి ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ అమెరికా తెలుగు సంబరాలని.. ఈ సంబరాల్లో పాలుపంచుకుంటే తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని 'నాట్స్' బృందం సభ్యులు రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు. సంబరాల్లో నిర్వహించే కార్యక్రమాల గురించి 'నాట్స్' బృందం రేవంత్ రెడ్డికి వివరించింది. ముఖ్యమంత్రిని కలిసిన 'నాట్స్' బృందంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, 'నాట్స్' బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షులు మదన్ పాములపాటి, ఎలెక్ట్ శ్రీహరి మందాడి, సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి, బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు పాల్గొన్నారు.
READ MORE ...
CM Revanth Reddy: వారితో కేసీఆర్ కు ప్రాణహాని.. సభలో రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్