Karimnagar సిల్వర్ ఫిలిగ్రీ కళకు జాతీయ స్థాయి గుర్తింపు

by GSrikanth |   ( Updated:2022-11-28 11:51:50.0  )
Karimnagar సిల్వర్ ఫిలిగ్రీ కళకు జాతీయ స్థాయి గుర్తింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్ జిల్లాలోని సిల్వర్ ఫిలిగ్రీ కళకు మరోసారి జాతీయ గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. ఫిలిగ్రీ కళాకారులు వెండి నగిషీతో తయారు చేసిన పల్లకికి జాతీయ స్థాయి అవార్డు దక్కింది. సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ సంస్థకు చెందిన ప్రధాన కార్యదర్శి గద్దె అశోక్ కుమార్ కిలోన్నర వెండి తీగలతో పల్లకిని 2018లోనే తయారు చేశారు. దానిని ఢిల్లీలోని జాతీయ హస్త కళల అభివృద్ధి సంస్థకు పంపించగా.. అవార్డుకు ఎంపికైంది. వెండి నగిషీ వస్తువుల తయారీకి అంతర్జాతీయ స్థాయిలో కరీంనగర్‌కు గుర్తింపు లభించింది. కరోనా కారణంగా అవార్డుల ప్రధానం ఆలస్యంగా జరిగింది. కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్ చేతుల మీదుగా ప్రధాన కార్యదర్శి గద్దె అశోక్ కుమార్‌కు అవార్డు అందుకున్నారు. దేశ, విదేశీ అతిథులకు ప్రభుత్వం తరఫున ఫిలిగ్రీ కళారూపాలు బహుకరించే ఆనవాయితీ ఉంది. కరీంనగర్లోని సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ సంస్థ కళాకారులు ఏటా వివిధ రూపాల కళాఖండాలు తయారు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ప్రధాన కార్యదర్శి గద్దె అశోక్ కుమార్ అన్నారు. ఈ అవార్డు రావడంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. సిల్వర్ ఫిలిగ్రీ కలను మరింత మందికి నేర్పించాల్సిన బాధ్యత ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed