Kaleshwaram : నేడు కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కీలక సమావేశం

by Sathputhe Rajesh |
Kaleshwaram : నేడు కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కీలక సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ శనివారం ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. భేటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు హాజరుకానున్నారు. మే 5న కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఇచ్చింది. జులై మొదటి వారంలోపే సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని నివేదిక అందజేసింది. జూన్ రెండో వారంలో పరీక్షలు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సాంకేతిక పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. అయితే వరద రావడంతో సాంకేతిక పరీక్షలు నిలిచిపోయాయి. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్‌డీఎస్‌ఏని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందజేసింది.

Advertisement

Next Story

Most Viewed