CM రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని సంచలన లేఖ

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-17 04:53:15.0  )
CM రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని సంచలన లేఖ
X

దిశ, వెబ్‌‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని లేఖ రాశారు. సీఎం రేవంత్ చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు ఉద్యోగం తప్ప వేరే ఉద్యోగానికి తాను సరిపోనన్నారు. ఉద్యోగానికి బదులు ధర్మ ప్రచారానికి సాయం చేయాలని కోరారు. ప్రస్తుతం ‘వేదం యజ్ఞం’ అనే పుస్తకం రాస్తున్నా అన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని నళిని తెలిపారు.

ఇక, ఇటీవల నిర్వహించిన పోలీసు శాఖ సమీక్షలో మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగం అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడంలో అభ్యంతరాలు ఎందుకు ఉండాలన్నారు. ఆమె సుముఖంగా ఉంటే ఉద్యోగాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story