- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులు కోటీశ్వరులు అయితే 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు..? వైఎస్ షర్మిల
దిశ, పెద్దవంగర: అల్లుడు వస్తే ఏడ పండాలే అన్న కేసీఆర్ మాట ఎటూపాయే, ఎంత మందికి డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిండు.. అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మహిళలను సూటిగా అడిగారు. పెద్దవంగర మండలం అవుతాపూర్ గ్రామంలో వైఎస్అర్ విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు.
నలభై వేలు ఇచ్చే రైతు సబ్సిడీ పథకాలను బంద్ పెట్టీ అయిదు వేలతో రైతు బంధు ఇస్తున్నారని, అయిదు వేలతో రైతులు కోటీశ్వరులు అవుతారా.. రైతులు కోటీశ్వరులు అయితే ఎందుకు ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని ప్రశ్నించారు. లక్షా 91 వేల ఉద్యోగాలు కళ్ళ ముందు ఖాళీగా కనిపిస్తున్నాయి. కానీ, ఇప్పటికీ ఇచ్చింది 43 వేల ఉద్యోగాలు మాత్రమే ఆ ఉద్యోగాలు ఎప్పటికీ వస్తయో తెలియని పరిస్థితిలో ఉద్యోగాలు రాక డిగ్రీలు, పీజీలు చదివి రోడ్లపై తిరుగుతున్నారని మండి పడ్డారు.
ఈ ఏడాది ఎన్నికలకు కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావులు వస్తారు. వీళ్లకు ఓట్లు వేస్తే తెలంగాణ గుల్ల అవుతుందని, కేసీఅర్ పాలన పోయి వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలన్నారు. తెలంగాణ పథకాలు మహిళలను, రైతులను కోటీశ్వరులను చేశామని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. అవుతాపురం గ్రామంలో వైఎస్అర్ విగ్రహాన్ని పెట్టిస్తే బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు.
వైఎస్ఆర్ మహిళ అభిమానులే రాత్రంతా కాపలా కాసి చలిమంటలు వేసుకుని మరీ విగ్రహాన్ని నిలబెట్టారు. వైఎస్సార్ బిడ్డగా మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. కానీ, కేసీఅర్ పేపర్ నమస్తే తెలంగాణ మాత్రం మహిళలు అడ్డుకున్నారు అని తప్పుడు వార్తను ప్రచురించిందన్నారు. గ్రామస్థులు అంగీకారంతోనే వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టుకున్నారు. నిజాన్ని అబద్ధాలుగా గోబెల్స్ ప్రచారం చేసే పేపర్ నమస్తే తెలంగాణ అని, పాదయాత్రలో ప్రతీ అడుగు సమస్యల వలయమేనని, కేసీఅర్ పాలన అద్బుతం అని గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారన్నారు.