- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓటు ఎవరికి వేస్తే ఉపయోగం ఉంటదో..ఆలోచించి ఓటు వేయాలి
దిశ, మేళ్లచెరువు: నాలుగేళ్ళలో జరిగిన అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపిస్తుందని అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం మేళ్ల చెరువు మండలంలో పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని వ్యాఖ్యానించారు. మీ ఓటు ఎవరికి వేస్తే ఉపయోగం ఉంటదో..ఆలోచించి ఓటు వేయాలనీ ప్రజలను కోరారు. పత్తా లేని ఉత్తమ్ కావాలా కండ్ల ముందు అభివృద్ధి చేసిన సైదన్న కావాల్నా ప్రజలు ఆలోచించాలని కోరారు. గతంలో హుజూర్నగర్ నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోలేదు, సైదన్న వచ్చాక అభివృద్ధి మొదలైంది అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. EVM ప్యాడ్‌లో 5వ నెంబర్ కారు గుర్తుకు ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు.
ఈనెల 30న జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి మరోసారి ఆశీర్వదించగలని కోరారు. కారు గుర్తుకు ఓటేద్దాం హుజుర్‌నగర్‌లో అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిద్దాం అని అన్నారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు చెప్పి రాజకీయం చేసేది ఓకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, మహిళలు కోలాటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ మహిళలు బొట్టుపెట్టి, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా నినాదాలు చేస్తూ, భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జ్ కాసోజు శంకరమ్మ, ఎన్నికల ఇంచార్జ్ రమణ , ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, రామారావు, బసవయ్య, బాల ఎంకన్న, గ్రామాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.