- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదర్శ పాఠశాలలో వాచ్‌మెన్ ఎక్కడ... ?
దిశ, నాగారం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారు మూల ప్రాంతాలలో (పల్లెలలో)ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశ్యంతో 2013 వ సంవత్సరంలో ఆదర్శ పాఠశాలలను ప్రారంభించారు. ఆదర్శ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఎల్‌ఈడీ స్క్రీన్‌లు(కంప్యూటర్)లను విద్యార్థుల ప్రయోజనం కోసం మంజూరు చేశారు. ఈ సాంకేతిక పరిజ్ఞాన సంపదను కాపాడేందుకు ప్రభుత్వం రాత్రి వేళలో వాచ్ మెన్ నియామకం కోసం ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే.....
నాగారం మండల పరిధిలోని పసునూరు ఆదర్శ పాఠశాలలో గత రెండు సంవత్సరాల క్రితం రాత్రి వేళలో వాచ్ మెన్‌గా నియమించినబడిన వాచ్మెన్ రాత్రి సమయంలో విధులకు హాజరు కాక పోగా పాఠశాల సమయంలో తనకు బదులుగా తన తల్లిని విధులకు హాజరవుతూ తన స్వగ్రామం (తుంగతుర్తి)లో విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ప్రాతిపాదికన విధులు నిర్వహిస్తూ ఆదర్శ పాఠశాల రాత్రి వాచ్‌మెన్‌గా, పగలు విద్యుత్ ఉద్యోగిగా రెండు చోట్ల జీతాలు పొందుతున్నాడని మండల ప్రజలు పేర్కొంటున్నారు.
ఇటీవల కంప్యూటర్‌లు మాయం…
ఆదర్శ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఎల్‌ఈడీ స్క్రీన్ లు(కంప్యూటర్) లను విద్యార్థులు ప్రయోజనం కోసం మంజూరు చేశారు. కాగా పాఠశాలకు రాత్రి వేళలో వాచ్ మెన్‌గా ఉన్న వ్యక్తి విధులకు రాకపోవడం వలన కంప్యూటర్‌లు దొంగిలించారని అనుకుంటున్నారు.
ప్రిన్సిపల్‌కు తెలిసే రెండు చోట్ల ఉద్యోగం…
ఆదర్శ పాఠశాలలో రాత్రి వేళలో వాచ్ మెన్‌గా పగలు విద్యుత్ ఉద్యోగిగా పనిచేస్తూ రెండు చోట్ల జీతాలు పొందుతున్న విషయం పాఠశాల ప్రిన్సిపాల్‌కు తెలిసిన వాచ్‌మెన్‌గా విధుల నుండి తొలగించగ పోవడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇలాంటీ వ్యక్తికి పాఠశాల ప్రిన్సిపాల్ సహకరించడం పట్ల మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అర్హత కోసం ఆధార్ మార్పు చేశారా?
ఆదర్శ పాఠశాల లో రాత్రి వేళలో వాచ్ మెన్‌గా 40 సంవత్సరాలు పై వయసు గల వారినే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆదర్శ పాఠశాలలో రాత్రి వాచ్‌మెన్‌గా నిధులు నిర్వహిస్తున్న వ్యక్తికి 38 సంవత్సరాల లోపే ఉన్నప్పటికీ ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చి 40 సంవత్సరాల పైగా వయస్సు ఉన్నట్టు పుట్టిన తేదీని మార్పు చేసి ఉద్యోగంలో చేరినట్లుగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చదువుకున్న సర్టిఫికెట్లలో డేటాఫ్ బర్త్ మార్చే అవకాశం లేకపోవడంతో ఇలా ఆధార్ కార్డులో డేట్ అఫ్ బర్త్ మార్పు చేసి ఉద్యోగంలో చేరడం వలన ఎందరో నిరుద్యోగులు నష్టపోతున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డు మార్పు విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు తనిఖీ చేసి నిర్ధారించాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎందరో నిరుద్యోగులు ఉన్నతమైన విద్యను అభ్యసించి యూనివర్సిటీలలో పీజీలు, పీహెచ్‌డీలు పూర్తి చేసి యువత ఉపాధి లేక ఉపాధి హామీ పనులకు వెళ్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఎందరో అర్హులైన నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. ఇలా నకిలీ పత్రాలు సృష్టించి ఒక వ్యక్తి రెండు ఉద్యోగాలు పొంది నిరుద్యోగులను మోసం చేస్తున్న ఇలాంటి వ్యక్తులను ఆయా శాఖల రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు గుర్తించి వారి పై శాఖ పరమైన చర్యలు తీసుకొని నిరుద్యోగులకు న్యాయం చేయాలని నాగారం మండల ప్రజలు కోరుతున్నారు.