- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏంది సామి ఇది..మరీ ఇంత దారుణమా..?
దిశ, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని ఓ హోటల్ బిర్యానీలో జెర్రీ వచ్చింది. దీంతో వినియోగదారుడు చేసిన ఫిర్యాదు చేయగా.. వివేరా హోటల్ పై ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ హోటల్ పై షెడ్యూల్ 4 ప్రకారం.. తనిఖీలు నిర్వహించి,అపరిశుభ్రత గమనించిన అధికారులు నోటీసు జారీ చేశారు. హోటల్ వంటగది, స్టోర్ రూమ్ పరిశీలించారు. తాజా కూరగాయలను, ఎఫ్ఎస్ఎస్ఎఐ గుర్తింపు పొందిన నూనె, పప్పులు, పిండి వంటి పదార్థాలను గడువు ముగియక ముందే వాడాలని ఆదేశించారు.ఎక్స్‌పైరీ డేట్ లేని కూల్ డ్రింక్స్ ను ధ్వంసం చేశారు. తయారుచేసిన ఆహార పదార్థాలు ఈగలు, దోమలు, బొద్దింకలు పడకుండా శుభ్రంగా ఉంచాలని సూచించారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వాడకూడదని తెలిపారు. తాజా ఆహార పదార్థాలని ప్రజలకు అందించాలని లేదంటే.. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. హోటల్ నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాదులోని టెస్టింగ్ ల్యాబ్ కు పంపించారు. సేకరించిన ఆహార శాంపుల్స్ కల్తీ అని తేలినట్లయితే దాని ఆధారంగా చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ప్రజలకు అందించే ఆహారపదార్థాలు కల్తీ లేకుండా ఆరోగ్యకరంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ హెచ్చరించారు.