- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోండి
దిశ, మునుగోడు; మునుగోడు మండలం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు హెల్మెట్ ధరించి ప్రాణాలు నిలబెట్టకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో.. జనవరి మాసమంతా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా మునుగోడు మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై శనివారం అవగాహన బైక్ ర్యాలీని నిర్వహించారు. తన మాతృమూర్తి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పోలీస్ శాఖ, స్థానిక నాయకులతో కలిసి వాహనదారులకు 300 హెల్మెట్లను ఎమ్యెల్యే రాజగోపాల్ రెడ్డి ఉచితంగా పంపిణీ చేశారు. మునుగోడు పట్టణంలో తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయం నుండి హెల్మెట్ ధరించి మునుగోడు పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా మునుగోడు పట్టణంలో హెల్మెంట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులను ఆపి తానే స్వయంగా హెల్మెట్ తొడిగారు. ప్రమాదాల బారిన పడి యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి నెల ఆఖరిలోనే నియోజకవర్గ స్థాయిలో రోడ్డు భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం చేపడతామన్నారు.