- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Komati Reddy Venkata Reddy : మట్టి రోడ్డు లేని రాష్ట్రంగా తెలంగాణను మారుస్తాం
దిశ, కనగల్లు: రాష్ట్రంలో ఎక్కడ మట్టి రోడ్డు అన్నదే లేకుండా ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రహదారులు నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Minister Komati Reddy Venkata Reddy) తెలిపారు. మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని పగిడిమర్రి గ్రామం సమీపంలోని సోమన్న వాగు వద్ద 38 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మూడు డబుల్ రోడ్లు,హై లెవెల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా..30 వేల కోట్ల రూపాయలతో రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో ఆర్ అండ్ బి రహదారులకు 600 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, శ్రీశైలం- దేవరకొండ రహదారి అటవీ ప్రాంతంలో ఉన్నప్పటికీ అభివృద్ధి చేస్తున్నామన్నారు. కనగల్ జంక్షన్ ను 8 కోట్ల రూపాయలతో వెడల్పు చేయడం జరుగుతున్నదని, అంతేకాక అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ధర్వేశిపురం రోడ్డు వెడల్పు చేసి నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయనున్నామని తెలిపారు.
అలాగే తిప్పర్తి జంక్షన్ ను 9 కోట్ల రూపాయలతో వెడల్పు చేసే పనులు ప్రారంభించడం జరిగిందని, ఇటీవలే మిర్యాలగూడలో 147 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రహదారి పనులు ప్రారంభించడం జరిగిందని మంత్రి వెల్లడించారు. 38 కోట్ల రూపాయలతో చేపట్టిన కొత్తపల్లి - పగిడిమర్రి, పగిడిమర్రి- మదనాపురం, పగిడిమర్రి- ఖుదావన్ పూర్ రోడ్లతో పాటు..పగిడిమర్రి అనంతారం డబుల్ రోడ్డు పనులు బుధవారం నుండి ప్రారంభం చేసి పది నెలల్లో బ్రిడ్జితో సహా పూర్తి చేస్తామని చెప్పారు. పగిడిమర్రి రోడ్డుతో పాటు, చెక్ డ్యామ్ సైతం నిర్మిస్తున్నామని, దీనివల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు కలుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ మట్టి రోడ్డు లేకుండా గ్రామాల నుంచి మండల కేంద్రానికి,మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి సుమారు 12 వేల కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు.
రోడ్లు,లిఫ్ట్ ఇరిగేషన్లు ,కాలువలు పూర్తి చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ద్వారా 100 కోట్ల రూపాయలు చేయించి వారం రోజుల నుండి బ్రాహ్మణవెళ్ళాంల లిఫ్ట్ పనులు నడుస్తున్నాయని,మూడు మాసాలలో లక్ష ఎకరాలకు సాగు నీరు ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎస్.ఎల్.బి.సి సొరంగం బడ్జెట్ ను 4600 కోట్లకు పెంచి అమెరికా నుంచి ఇంజన్ బేరింగ్ ని తెప్పించి రెండు నెలల్లో పనులు ప్రారంభించనున్నామన్నారు. రెండేళ్లలో ఎస్.ఎల్.బి.సి పనులు పూర్తి చేసి రెండు పంటలకు నీళ్లు ఇస్తే రైతుల కళ్ళల్లో సంతోషం కనబడుతుందన్నారు. దీపావళి తర్వాత ఇల్లు లేని నిరుపేదలకు అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 చొప్పున ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నామని, రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఎకరంకు సాగునీరు ఇవ్వడంతో పాటు, మిగిలిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్లను పూర్తి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.నవంబర్ నెలలో నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల తో పాటు..బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ప్రారంభించే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మందడి రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ గోలి జగాల్ రెడ్డి, నర్సిరెడ్డి, వరికుప్పల రవి, వెంకన్న, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.