- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Deputy CM Bhatti Vikramarka : విద్యార్థుల కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం..
దిశ, హుజూర్ నగర్ :గత పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ నేతలు సంక్షేమ విద్యార్థుల మెస్,కాస్మోటిక్స్ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని..అలాంటివారు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka )అన్నారు.ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గడ్డిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Minister Komati Reddy Venkata Reddy )స్థానిక ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ .ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి భూమి పూజ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే కోరి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తు చేశారు. అలాంటి రాష్ట్రంలో గత పాలకులు పదేళ్లపాటు ఈ వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని వివరించారు. 2007 తర్వాత నిరుపేద విద్యార్థులు చదువుకునే సంక్షేమ వసతిగృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో మెస్, కాస్మోటిక్ ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఇందిరమ్మ ప్రభుత్వం దీపావళి పండుగ రోజు 7.50 లక్షల మంది నిరుపేద విద్యార్థులు చదువుకునే సంక్షేమ వసతి గృహాలు,రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెస్ కాస్మోటిక్స్ చార్జీలు ఒక్కసారిగా 40 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని ఆ మేరకు ఆదేశాలు విడుదల చేశామని తెలిపారు.విద్యార్థుల పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకొని ఇచ్చే కాస్మోటిక్ చార్జీలు పదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఏడు లక్షల కోట్ల అప్పు చేసి తమ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని తెలిపారు.పేద బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం,బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చైనా భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొనడం ఈరోజు విద్యారంగానికి చారిత్రాత్మకం అని అభివర్ణించారు.
అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట చదువుకునేందుకే ఈ స్కూళ్లు...
నాలుగో తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని వర్గాల విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీ, జనరల్ అందరూ ఒకే చోట చదువుకునేలా అద్భుతంగా నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ పాఠశాలలో అద్భుత క్రీడా ప్రాంగణాలు,ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన..మన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా 25 ఎకరాల ఆహ్లాదకర వాతావరణంలో సకల సౌకర్యాలతో నిర్మిస్తున్నామని వివరించారు. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు కూడా ఈ పాఠశాల ప్రాంగణంలో ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ మంత్రిమండలి ఆలోచించి ఇంటర్నేషనల్ స్కూల్స్కు డిజైన్లు ఇచ్చే ప్రపంచ స్థాయి ఆర్కిటెక్ట్ కు బాధ్యతలు అప్పగించామని ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తామన్నారు. ప్రధానంగా విద్య, వైద్యంపై దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు. పాఠశాలలు పెట్టడమే కాదు వాటికి నిధులు కేటాయించి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. తమ ప్రభుత్వం ఇదే రంగానికి ఒకే ఏడాదిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం ఐదు వేల కోట్లు కేటాయించాం అంటే పేద పిల్లల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో మీ అందరూ గమనించాలని అన్నారు. ప్రతి పైసా పోగు చేసి ప్రజల కోసం ఖర్చు పెడతాం సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతాం పేదల కోసం కష్టపడతామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభించేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం..
ప్రగతిశీల భావాలతో ముందుకు పోవాలని, అద్భుతమైన తెలంగాణ ఆవిష్కరించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ నిర్ణయించుకొని రోజుకు 18 గంటల పాటు పనిచేస్తున్నామని తెలిపారు. ఈ రాష్ట్ర సంపద ప్రజలకు ఉపయోగపడాలి కానీ..పాలకులు పంచుకోవడానికి కాదు అన్నారు.యాదాద్రి పవర్ ప్లాంట్ ఎక్కడి పనులు అక్కడే నిలిచి ఉండగా మేము అధికారంలోకి రాగానే పర్యావరణ అనుమతులు సాధించామని తెలిపారు. ఏడాదిలో మూడు సార్లు పర్యటించి రెండు యూనిట్లు సింక్రనైజ్ చేశామని తెలిపారు. ఎస్ ఎల్ బి సి సొరంగం ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కూర్చుని పూర్తి చేయిస్తామని, నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన గత పాలకులు పదేళ్ల కాలంలో ఒక్క కిలోమీటర్ సొరంగం తొవ్వకం పూర్తి చేయలేదని విమర్శించారు. 42 కిలోమీటర్ల సొరంగ మార్గం కాగా 32 కిలోమీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే తవ్వితే.. మిగిలిన 10 కిలోమీటర్లలో ఒక్క కిలోమీటర్ కూడా పదేళ్లు పాలించిన టిఆర్ఎస్ పాలకులు పూర్తి చేయలేదని విమర్శించారు. మేం అధికారంలోకి రాగానే ఎస్ఎల్బీసీ దగ్గర సమీక్ష సమావేశం పెట్టి ప్రతి నెల ఎంత పని జరిగితే అంత మొత్తానికి వెను వెంటనే నిధులు మంజూరు చేస్తామని చెప్పామన్నారు.20 నెలల్లో ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి తాను ఎస్ ఎల్ పి సి దగ్గర సమీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు.