వన మహోత్సవానికి శాఖల వారీగా ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలి : కలెక్టర్

by Kalyani |
వన మహోత్సవానికి శాఖల వారీగా ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలి : కలెక్టర్
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: వన మహోత్సవానికి శాఖలవారిగా ఇచ్చిన లక్షణాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లతతో కలిసి పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాఖలవారిగా వనమహోత్సవంలో భాగంగా ఇచ్చిన లక్ష్యాల ప్రకారం మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాకు 53 లక్షల 45 వేల మొక్కలు లక్ష్యం కాగా 7,98,100 ఈరోజు వరకు మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. జిల్లాలో వర్షాలు పడుతున్నందున జ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా గ్రామ పంచాయతీ, వైద్య అనుబంధ శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిసరాల పరిశుభ్రత, మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు.

అదేవిధంగా గ్రామాల్లో పాత ఇండ్లను గుర్తించి నివేదిక అందించాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరి చేయడం జరిగిందని, పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయని నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ప్రజా పాలన దరఖాస్తుల కొరకు అన్ని మండల కార్యాలయాలలో, మున్సిపాలిటీ లలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పెండింగ్ లో ఉంచొద్దని సమస్యలు ఉంటే దానికి గల కారణాలను అర్జీదారులు తెలపాలని సూచించారు. మహిళా శక్తి లో భాగంగా మహిళల సంఘాలకు మీ సేవా కేంద్రాలు, క్యాంటీన్లు అలాగే ఇతర కార్యక్రమంలో ఉత్సాహంగా ఉన్న లబ్దిదారులను గుర్తించి ఆయా రంగాలపై ప్రత్యేక తర్ఫీదు కల్పించాలని సూచించారు.

అదేవిధంగా వసతి గృహాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వేరు వారానికి రెండు సార్లు హాస్టలను, విద్యార్థుల యొక్క బోధన సదుపాయాలను, అసభ్యతపై స్పెషల్ క్లాసులను పరిశీలన చేసి నివేదికలు అందించాలని ఆదేశించారు. ప్రతి హాస్టల్స్ లో కంప్లైంట్ బాక్స్ తప్పక పెట్టాలని కలెక్టర్ సూచించారు. మండల స్పెషల్ ఆఫీసర్లు జిల్లాలోని గ్రామ, మండల స్థాయిలలో ప్రభుత్వ పథకాలను ప్రతి మంగళవారం, శుక్రవారం తనిఖీలు చేయాలని సూచించారు. ఆదివారం తహసీల్దార్ లు సీఎంఆర్ పై దృష్టి సారించాలని అలాగే రేషన్ పంపిణీ సరిగా చేస్తున్నారా లేదా అధికారులు అవకాశం ఇంకా ప్రకటన చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.

ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 59 దరఖాస్తులు, డీఆర్డీఓ 8, మెడికల్ 6 మొత్తం దరఖాస్తులు 98 అందాయని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు. ఈ సమావేశంలో సీఈఓ అప్పారావు, డీఆర్డిఓ మధుసూదన్ రాజు, డీపీఓ సురేష్ కుమార్, సీపీఓ కిషన్, ఎస్టి, ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు లత, శంకర్, అనసూర్య, జగదీశ్వర్ రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed