రైతును వెంటాడిన అకాల వర్షాలు

by Naveena |
రైతును వెంటాడిన అకాల వర్షాలు
X

దిశ, అడ్డగూడూరు: అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్రంగా దెబ్బతీశాయి.అడ్డగూడూరు మండలంలోని పలు గ్రామాల్లో వరి, పత్తి సాగు చేసిన రైతులను తీవ్ర నష్టాలకు గురిచేసింది.వరి పంట దాదాపు మనాయికుంట గ్రామంలో 50 ఎకరాలు పైగా నేలమట్టమయింది. గట్టు సింగారం గ్రామంలో దాదాపు 130 ఎకరాలు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీదేవి కాలువలో 150 ఎకరాల పైగా నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. అలాగే ధర్మారం 50 ఎకరాల పైగా నష్టం వాటిందని అంచనా అంటే దాదాపు 380 ఎకరాల.. పంట నష్టం వచ్చింది. ఎకరానికి ఒక రైతు వరికి పెట్టే ఖర్చు 25000 నుంచి 30000 వరకు ఖర్చు చేశామనన్నారు. అలాగే పత్తి కూడా గాలి బీభత్సంతో.. మొత్తం నేరాలిపోయింది. మండలంలో ముందుగా పెట్టిన దొడ్డు వడ్లు చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు పూర్తిగా నేలరాలాయని రైతులు వాపోతున్నారు. ఎలాగైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story