అగమ్యగోచరంగా జర్నలిస్టుల జీవితాలుః టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య

by Nagam Mallesh |
అగమ్యగోచరంగా జర్నలిస్టుల జీవితాలుః టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య
X

దిశ , సూర్యాపేట : ఎన్ని ప్రభుత్వాలు మారినా.. జర్నలిస్టుల జీవితాలు మాత్రం మారట్లేదని.. అగమ్య గోచరంగానే ఉంటున్నాయని అన్నారు టిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య. ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన టిడబ్ల్యుజెఎఫ్ జిల్లా మూడో మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని.. దీన్ని తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దాడులను నిరోధించేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా తాత్పర్యం చేశాయని.. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకు హామీలు ఇచ్చి విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల కుటుంబాల కోసం ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రత్యేక జీవ తీసుకువచ్చి అమలు చేయాలన్నారు. ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఎక్స్ గ్రేషియా అమలు చేసి వారి కుటుంబానికి బాసటగా నిలవాలన్నారు. సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించి, జీతాలు ఇవ్వాలన్నారు. చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా ఐత బోయిన రాంబాబు గౌడ్, జిల్లా కార్యదర్శిగా బుక్క రాంబాబు, ఉపాధ్యక్షులుగా షేక్ జానీ, ధరావత్ రవీందర్ నాయక్, చల్ల రామారావు, సంయుక్త కార్యదర్శి ఎరుకల సైదులు గౌడ్, టేకుల సుధాకర్, వంగాల వెంకన్న, కుర్ర గోపి, బి శ్రీనివాస్, తొట్ల ఉపేందర్, కోశాధికారిగా పాల్వాయి యామిని, జిల్లా కార్యవర్గ సభ్యులుగా రావుల రాజు, లింగమూర్తి, శ్యామ్, జగదీష్, అజయ్, పరమేష్, గుడిపూడి ప్రభాకర్, రెడ్డి బిక్షం రూథర్, శంకర్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు.గా సలిగంటి పుల్లయ్య,పి.వెంకట్ రెడ్డి,బత్తిని వెంకటేష్,నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా సట్టు శ్రీను, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా పాల్వాయి జానయ్య,రాష్ట్ర కమిటీకి నాయిని శ్రీనివాసన్ పంపాలని కమిటీ తీర్మానించినట్లు తెలిపారు. తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా లింగాల సాయి గౌడ్,కార్యదర్శిగా నందిపాటి సైదులు,కోశాధికారిగా వేల్పుల ప్రవీణ్,ఉపాధ్యక్షులుగా వెలుగు సైదులు,సహాయ కార్యదర్శిగా పుట్ట రాంబాబు, నాయిని రమేష్ లింగయ్యను ఎన్నుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed