collector : నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా త్రిపాఠి..

by Sumithra |
collector : నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా త్రిపాఠి..
X

దిశ, నల్లగొండ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సి.నారాయణరెడ్డిని ( C. Narayana Reddy ) రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బదిలీ చేయగా, ఆయన స్థానంలో ( 2017) ఐఏఎస్ బ్యాచ్ అధికారిణి ఇలా త్రిపాఠిని (Tripathi) నియమించింది. రాష్ట్ర పర్యాటక శాఖ సంచాలకులుగా పనిచేస్తున్న ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలను చేపట్టారు. నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠికి జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి మోతిలాల్, పలువురు విభాగాల అధిపతులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Next Story