ప్రమాదకర బ్రిడ్జిలపై ప్రయాణం బంద్

by Nagam Mallesh |
ప్రమాదకర బ్రిడ్జిలపై ప్రయాణం బంద్
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భారీ వర్షాలు, వరదలు ఉన్నందున ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జిలపై ప్రయాణాలు బంద్ చేయించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సొమవారం బీబీనగర్ మండలం రుద్రవెల్లి బ్రిడ్జిని ఆయన సందర్శించి మూసీ నది ఉధృతిని పరిశీలించారు. వరదలు ఎక్కువగా ఉన్నందున బ్రిడ్జిపై ఎవరినీ అనుమతించవద్దని.. చేపల వేటకు మత్స్యకారులను వెళ్లనివ్వవద్దని, బారికేడింగ్ బందోబస్తుతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. వాగులు, వరద నీరు పొంగి పొర్లుతున్నందున వాటి దగ్గరకు వెళ్లవద్దని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ముఖ్యంగా సెల్పీలు, ఫోటోగ్రాపులు తీసుకోవద్దని కోరారు. అనంతరం పోచంపల్లి మండలం రామానందతీర్థ ఇనిస్టిట్యూషన్ సందర్శించి వృతి విద్యా కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్ధులతో మాట్లాడారు. కోర్సులకు సంబంధించిన అంశాలను వారిని అడిగి తెలుసుకున్నారు. వృతి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకొని నైపుణ్యం సాధించాలని తెలిపారు. విద్యార్ధుల వసతి గృహాలలో వారికి అందిస్తున్న భోజన వసతి సౌకర్యాలను పరిశీలించారు.

Advertisement

Next Story

Most Viewed