- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ నాదే..టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి..
దిశ, సంస్థాన్ నారాయణపురం : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ పై అధిష్టానం తనకు స్పష్టమైన హామీ ఇచ్చిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో టికెట్ ఆశించి టికెట్ రాకున్నా పార్టీ గెలుపు కోసం తాను పడ్డ కష్టాన్ని అధిష్టానం గుర్తించిందని అన్నారు. ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ ఉమ్మడి గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుండి తాను మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం పనిచేస్తానని అన్నారు. ఘర్ వాపసి కార్యక్రమం పేరుతో ఇతర పార్టీలోకి వెళ్లిన వారిని తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు మోడీ ప్రధాన కారణమని అన్నారు.
శవపేఠికకు వాడే వస్తువుల పై కూడా ధరలను పెంచారని అన్నారు. పేదల పొట్ట కొట్టి అదాని, అంబానీలకు దోచి పెడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక లేకుండా చేసేందుకు రాహుల్ గాంధీ పై అనర్హత వేటువేశారని అన్నారు. దేశంలో ఎవరు ప్రశ్నించినా ఇలాగే చేసి ప్రజాస్వామాన్ని కూని చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ హయాంలో ఇండ్లు కట్టించి, రోడ్లు వేయించి, భూములు పంచారని ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇంటింటికి తిరిగి పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. యుద్ధం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఒక సైన్యంగా పార్టీ కార్యకర్తలు అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. గ్రూప్ వన్ పేపర్ లీక్ కేసీఆర్ కుటుంబ మెడకు చుట్టుకోకుండా ఎస్ఎస్సీ పేపర్ లీక్ ను తెరపైకి తెచ్చారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఏపూరి సతీష్, షబ్బీర్, సురిగి నరసింహ, బోయ దేవేందర్, సుర్వి నర్సింహా గౌడ్, బాలగోని బక్కులు, జక్కిడి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.