టెన్షన్ టెన్షన్.. పోలీసుల దిగ్భందంలో తిరుమలగిరి టౌన్

by Mahesh |   ( Updated:2023-05-24 05:52:21.0  )
టెన్షన్ టెన్షన్.. పోలీసుల దిగ్భందంలో తిరుమలగిరి టౌన్
X

దిశ, అర్వపల్లి/తుంగతుర్తి: ఇటీవల తిరుమలగిరిలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ, కాంగ్రెస్, అఖిలపక్ష పార్టీల నేతలతో పాటు ఎమ్మార్పీఎస్ సంఘాల నాయకులను ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తన వ్యాఖ్యలతో కించపరచడు. దీంతో అతని వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం తిరుమలగిరి మండల కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగా నియోజకవర్గ వ్యాప్తంగా పలువురిని అరెస్టులు చేశారు.

నూతనకల్ మండల కేంద్రంలో మంగళవారమే అఖిలపక్ష నేతలు నిర్వహించిన ధర్నా, రాస్తారోకో కార్యక్రమానికి సంబంధించి పలువురిని అరెస్ట్ చేశారు. అలాగే జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, తిరుమలగిరి, తదితర మండలాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచే బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, ఎంఆర్పీఎస్, ఇతర దళిత సంఘాల నాయకులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

పోలీసుల దిగ్భందంలో తిరుమలగిరి..

తిరుమలగిరి మండల కేంద్రంలో బుధవారం అఖిలపక్ష నేతలు నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, నాగారం, తిరుమలగిరి మండలాల నుండే కాకుండా ప్రాంతాల నుంచి సీఐ, ఎస్ఐలు, వందలాది మంది పోలీసులు ఉదయాన్నే తిరుమలగిరి చేరుకొని బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా ముందస్తుగా మంగళవారం రాత్రి నుండే పోలీసులు అప్రమత్తమయ్యారు.

కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్‌టీపీ, తదితర పార్టీలతో పాటు.. పలు ప్రజా సంఘాల నాయకుల ఆచూకీలను తెలుసుకుంటూ అరెస్టులు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా నాయకులు ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ముందస్తుగానే ప్రకటించడంతో తిరుమలగిరి మండల పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Advertisement

Next Story

Most Viewed