ఆ ఆయుధాలు వెంటనే డిపాజిట్ చేయాలి

by Naresh |
ఆ ఆయుధాలు వెంటనే డిపాజిట్ చేయాలి
X

దిశ, నల్గొండ: పార్లమెంట్ ఎన్నికల కోడ్ విడుదలైన సందర్భంగా నల్గొండ జిల్లా పరిధిలోని మొత్తం 136 ఆయుధాలకు లైసెన్స్‌లు ఉన్నాయని వాటిని వెంటనే సమీప పోలీసు స్టేషన్‌లో లేదా జిల్లా పోలీసు కార్యాలయంలో డిపాజిట్‌ చేయాలని జిల్లా ఎస్పీ. చందన దీప్తి ఆదేశాలు జారీచేశారు. ఆమె మాట్లాడుతూ… రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు, శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా, ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాబట్టి ఆయుధాల చట్టం 1959 సెక్షన్‌ 21 ప్రకారం లైసెన్స్ ఆయుధాలు కలిగి ఉన్నవారు వెంటనే డిపాజిట్‌ చేయాలని, అలా చేయని వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడుతాయని తెలిపారు. డిపాజిట్‌ చేసిన ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తీసుకోవచ్చని సూచించారు. ఈ విషయంలో జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతా సిబ్బంది, గార్డు డ్యూటీలో ఉన్న వారికి మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed