ఈ జోడి రూటే సపరేటు.. అలాంటి వాళ్లే వీళ్లా టార్గెట్

by Naresh |
ఈ జోడి రూటే సపరేటు.. అలాంటి వాళ్లే వీళ్లా టార్గెట్
X

దిశ, నల్గొండ: నల్లగొండ పోలీసులకు ఒక కిలాడీ జోడి చిక్కారు. ఈ విషయమై నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ పూర్తి వివరాలు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే నేరస్థుడు గోపి కృష్ణ, తన మొదటి భార్యతో గొడవలు పెట్టుకుని ఒంటరిగా ఉంటున్నాడు. నేరస్థురాలు మహేశ్వరి భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటుంది. ఇద్దరికి సుమారు ఒక సంవత్సరం క్రితం పరిచయం ఏర్పడి తిరుపతిలో ప్రేమ పెళ్లి చేసుకుని, ఇద్దరు కలిసి ఉంటున్నారు. గోపి కృష్ణ వృత్తిరీత్యా కార్ డ్రైవింగ్ పని చేస్తున్నాడు. మహేశ్వరి కూలీ పనులు చేస్తూ ఉంటుంది. ఇద్దరికీ వారికి వచ్చే సంపాదన కుటుంబ అవసరాలకు, వారి వ్యక్తిగత జల్సాలకు సరిపోక ఇద్దరు కలిసి ఒంటరిగా ప్రయాణించే వారిని చూసుకొని వారిని కారులో ఎక్కించుకుని మార్గమధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి ప్రయాణికులను తమ వద్ద ఉన్న కత్తులను చూపుతూ భయపెట్టి వారి వద్ద ఉన్న బంగారం, డబ్బులను దోచుకోవాలని పథకం వేశారు.

అందులో భాగంగా ఈ నెల 10వ తేదీన బాధితుడు తన స్వస్థలం అయిన బ్రూగుపడు గ్రామం, సత్తెనపల్లి టౌన్ & మండలంలో తన బంధువులు చనిపోగా హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ కార్యక్రమానికి హాజరై, తిరిగి అదే రోజు రాత్రి సమయంలో పిడుగురాళ్ల టౌన్ నందు హైదరాబాద్‌కు వెళ్ళుడానికి బస్ లేదా కార్ కొరకు ఎదురు చూస్తుండగా అదే సమయంలో నేరస్తుడు గోపి కృష్ణ, మహేశ్వరి ఇద్దరు కిరాయికి తెచ్చుకున్న AP-05-DT-2123 నెంబర్ కార్‌లో బాధీతుడు ఒంటరిగా ఉడడం గమనించి కారులో ఎక్కించుకొని నల్గొండ బైపాస్ నుంచి కాకుండా నల్గొండ టౌన్‌లో నుంచి దేవరకొండ రోడ్‌లో వస్తు కొత్తపల్లి గ్రామ శివారులో గల గంగమ్మ గుడి వద్ద కారు ఆపారు. వారి వద్ద కారులో పెట్టుకొని ఉన్న రెండు కత్తులను చూపుతూ, బాధితుడిని భయపెట్టి తన మెడలో ఉన్న బంగారం ఇవ్వకపోతే చంపుతా అని గట్టిగా బెదిరించడంతో బాధితుడు భయపడి తన మెడలో ఉన్న సుమారు 15 గ్రాముల బంగారం చైన్‌ను తన మెడలో నుండి తీసి నేరస్తులకు ఇవ్వగా, ఇద్దరు నేరస్తులు బాధితుడిని కారులో నుంచి దింపి పారిపోవడం జరిగింది.

బాధితుడు ఆ రోజు అర్ధరాత్రి కావడంతో భయపడి నేరుగా ఇంటికి వెళ్లి మరుసటి రోజు అనగా తేదీ 12/03/2024 రోజున ఉదయం పోలీస్ స్టేషన్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా నల్గొండ రూరల్ ఎస్‌ఐ జె.శివకుమార్ కేసు నమోదు చేసి, తన సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ తిరుమలేష్‌ను కారు వివరాల గురించి పంపగా మాడ్గులపల్లి టోల్ గేట్ వద్ద కారు వివరాలు తెలుసుకొని కారు ఓనర్ వివరాలు, నేరస్థుల వివరాలు తెలుసుకోవడం తెలుసుకున్నారు. నిన్న సాయంత్రం సమయంలో మర్రిగూడ బై-పాస్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా నల్గొండ రూరల్ ఎస్‌ఐ, వారి సిబ్బంది నేరస్థులు హైదరాబాద్ వైపు వెళ్తుండగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి AP-05-DT-2123 నెంబర్ కారు, 15 గ్రాముల బంగారం చైన్, రెండు కత్తులు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేశారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన నల్లగొండ సీఐ డానియల్‌ని నల్గొండ రూరల్ ఎస్‌ఐ శివకుమార్, వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ తిరుమలేష్, ఇతర సిబ్బందిని నల్గొండ డీఎస్‌పీ శివరాం రెడ్డి అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed